నాడు కేరళ వరద బాధితులకు కోటి రూపాయల విరాళమిచ్చిన సుశాంత్

ముంబైలోని బాంద్రాలో నిన్న ఆత్మహత్యకు పాల్పడిన సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదారతను తెలిపే విషయం బయటపడింది. 2018 లో కేరళలో భారీ వరదల కారణంగా వేలాది మంది ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

నాడు కేరళ వరద బాధితులకు కోటి రూపాయల విరాళమిచ్చిన సుశాంత్

Edited By:

Updated on: Jun 15, 2020 | 1:54 PM

ముంబైలోని బాంద్రాలో నిన్న ఆత్మహత్యకు పాల్పడిన సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉదారతను తెలిపే విషయం బయటపడింది. 2018 లో కేరళలో భారీ వరదల కారణంగా వేలాది మంది ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారిలో అనేకమంది తమకు సహాయం చేసేవారికోసం ఎదురు చూస్తుండగా.. సుశాంత్ అభిమాని ఒకరు వారిని ఆదుకోవలసిందిగా అతడిని కోరారు. ఈ అభ్యర్థనకు స్పందించిన సుశాంత్.. ఆ అభిమాని పేరిటే ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. ఈ సాయాన్ని మీ పేరిట ముఖ్యమంత్రి సహాయ నిధికి డొనేట్ చేయండి అని కూడా సుశాంత్ కోరాడట.. సుశాంత్ మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ కి ఓ ట్విటర్ యూజర్ దీన్ని కూడా షేర్ చేశారు. సుశాంత్ నిస్వార్థ సేవా నిరతిని కేరళ సీఎం పినరయి విజయన్ గుర్తు చేసుకుంటూ అతని ఫొటోతో బాటు ట్వీట్ చేశారు.