
What India Thinks Today: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది.. మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకోవడంతోపాటు.. 370సీట్లు టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ సొంతంగా 370 స్థానాలను కైవసం చేసుకోవడంతోపాటు.. ఎన్డీయే కూటమి మొత్తం 400 స్థానాలను గెలుచుకోవాలని ఇప్పటికే ప్లాన్ రచించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 29న వచ్చే గురువారం తొలివిడతగా 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుంది. అయితే, ఈ తొలి జాబితాలో అగ్ర నేతలతోపాటు.. పలు రాష్ట్రాలకు చెందిన సిట్టింగ్ ఎంపీలు ఉంటారని సమాచారం.. అయితే, 400ల లోక్ సభ స్థానాల లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ కూటమి.. వ్యూహం ఏంటి..? మూడో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఎలాంటి ప్లాన్ రచించింది..? మోదీ మ్యాజిక్ కు కారణమేంటి..? అనే వివరాలను టీవీ9 మెగా కాంక్లేవ్ లో జేపీ నడ్డా వెల్లడించనున్నారు.
దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే మెగా సమ్మిట్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ 3 రోజుల సుదీర్ఘ వార్షిక సమ్మేళనం.. ఢిల్లీ వేదికగా ఈ రోజు సాయంత్రం ప్రారంభమవుతుంది. మూడవ రోజుల కార్యక్రమంలో.. ప్రతి సెషన్‌లో రాజకీయ అంశాలను బహిరంగంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా రెండు జాతీయ పార్టీల జాతీయ అధ్యక్షులు కూడా పాల్గొంటారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించేందుకు బీజేపీ, ఎన్డీయే కూటమి ఎలా పని చేస్తుందో నడ్డా ఈసారి వేదికపై చర్చించనున్నారు.
27న చివరి రోజు జరిగే టీవీ9 సెషన్ లో ‘మూడోసారి మోడీ ప్రభుత్వమేనా’ అనే అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి వరకు బీజేపీ చేస్తున్న సన్నాహాలను ఆయన చెప్పనున్నారు. అంతేకాకుండా.. ఈ ఎన్నికలలో పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంది.. హ్యాట్రిక్ విజయం కోసం వారి ఎజెండాలో ఏముంది..? అనే దాని గురించి కూడా అభిప్రాయాలను తెలియజేయనున్నారు. దీంతో పాటు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంశంపై కూడా జేపీ నడ్డా తన పార్టీ అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఉంది..
వాస్తవానికి.. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. కానీ అన్ని పార్టీల్లోనూ ఎన్నికల సందడి నెలకొంది. ఇండియా కూటమి కూడా బీజేపీ ప్రణాళికలకు బ్రేక్ వేసేందుకు సిద్ధమవుతుంది.. ఇతర ప్రాంతీయ పార్టీలతో సీట్లు పంచుకునే విషయంలో కాంగ్రెస్.. ఆచీతూచి వ్యవహరిస్తూ.. ముందుకువెళ్తోంది. యూపీలో సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పెట్టుకోగా, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవాలలో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాల్లో బహుముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు సంబంధించి బీజేపీలో ఏం జరుగుతోందో కూడా జేపీ నడ్డా మాట్లాడే అవకాశం ఉంది.
అయితే, ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ముంబైలో జరిగిన పార్టీ సంబంధిత కార్యక్రమంలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈసారి వంశపారంపర్య రాజకీయాలకు, అవినీతికి మధ్య పోటీ ఉంటుందని, మరోవైపు అభివృద్ధిని చూసి.. దీనిని కొనసాగించేందుకు ప్రజలు తమ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారంటూ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన ఆయన.. వారు వంశపారంపర్యంగా లేక అవినీతిలో మునిగిపోయారని అన్నారు. గత పదేళ్లలో మొదటి సారి ఓటర్లు అభివృద్ధిని మాత్రమే చూశారని, గత ప్రభుత్వాల మాదిరిగా అవినీతిని చూడలేదని నడ్డా పేర్కొన్నారు. ఈ క్రమంలో టీవీ9 సమ్మిట్ నడ్డా ఏం మాట్లాడతారనేది ఆసక్తి రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..