అస్సాం మిజోరం బోర్డర్లో నిన్న ఆరు గంటలపాటు ఉభయ రాష్ట్రాల పోలీసులు లాఠీ ఛార్జి, కాల్పులు, బాష్ప వాయు ప్రయోగం తదితర హింసాత్మక ఘటనలతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. ముఖ్యంగా కోలాసిబ్ ప్రాంతం వీటితో అట్టుడికింది. ఈ వయొలెన్స్ లో ఆరుగురు అస్సాం పోలీసులు మరణించగా.. రెండు వైపుల నుంచి 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అల్లర్లు,ఘర్షణలకు సంబంధించిన వీడియోలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ రిలీజ్ చేశారు. నీది తప్పంటే నీది తప్పని ఒకరికొకరు ఆరోపించుకుంటూ ట్వీట్లు చేశారు. తమ సరిహద్దుల్లోని లాలాపూర్ లో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను, రోడ్డును నాశనం చేసి ఆక్కడ సాయుధ క్యాంపును మిజోరం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అస్సాం సర్కార్ ఆరోపించింది. పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన తమ పోలీసులపై అక్కడి స్థానికులు కర్రలతో దాడికి పాల్పడ్డారని, మిజోరాం పోలీసులు కూడా వారికీ వత్తాసు పలికారని అస్సాం పేర్కొంది. ఒక దశలో తమ పోలీసులపై వాళ్ళు కాల్పులు జరిపారని తెలిపింది. అయితే అస్సాం పోలీసులే తమవారిని రెచ్చగొట్టారని,అకారణంగా కాల్పులకు దిగారని మిజోరం ప్రభుత్వం కూడా ఎదురు దాడికి దిగింది. కొలాసిబ్ లో గల తమ సిఆర్ పీఎఫ్ పోస్టును దాటి వచ్చి ఫైరింగ్ చేశారని ఈ ప్రభుత్వం వెల్లడించింది.
కాగా ఈ ఘర్షణల్లో గాయపడిన పోలీసులను అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. జరిగిన ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు, అటు-ఈ ఘటనలపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఈ దేశ హోమ్ మంత్రి దేశంలో విద్వేష బీజాలు నాటుతున్నారని, ప్రజల్లో అశాంతిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు తలెత్తిన దారుణ పరిణామాల పై చింతిస్తున్నారని ఎద్దేవా చేశారు. అస్సాం, మిజోరం రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్ చేయాలని ఈ పార్టీ అధికార ప్రతినిధిజీ రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఇవి శాంతి భద్రతలను పరిరక్షించలేకపోయాయన్నారు.
Heartfelt condolences to the families of those who’ve been killed. I hope the injured recover soon.
HM has failed the country yet again by sowing hatred and distrust into the lives of people. India is now reaping its dreadful consequences. #AssamMizoramBorder pic.twitter.com/HJ3n2LHrG8
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : వధువుకి గులాబ్ జామ్ ఇచ్చేందకు వరుడు తిప్పలు..!వధువులు ఎం చేసిందో చుడండి..వైరల్ వీడియో:Viral Video.
భర్త చేసిన పాడు పనికి హీరోయిన్ రాజీనామా..ఆ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు..:Shilpa Shetty video.