కోల్‌కతా వైద్యురాలి హత్యకు నిరసనగా టీఎంసీకి షాక్.. ఆపార్టీ ఎంపీ రాజీనామా!
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో యువ వైద్యురాలి అత్యాచారం, హత్య కేసుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సర్కార్ పార్టీకి రాజీనామా చేశారు. ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో యువ వైద్యురాలి అత్యాచారం, హత్య కేసుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సర్కార్ పార్టీకి రాజీనామా చేశారు. ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి రాసిన లేఖలో సర్కార్ తన సొంత పార్టీలో అవినీతిపరుల ప్రవర్తన హద్దులు దాటిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన మమత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, పార్టీలో అవినీతి అంశాన్ని కూడా లేవనెత్తారు. మమతా బెనర్జీ ప్రభుత్వం దోషులపై అత్యవసర చర్యలు తీసుకుంటుందని ఆశించాను, కానీ అలాంటి చర్య తీసుకోలేదు. త్వరలో రాష్ట్రంలో శాంతి నెలకొనాలని, దోషులను శిక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సమ్మె చేస్తున్న వైద్యులను శాంతింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తారని అనుకున్నాను కానీ అది జరగలేదు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జవహర్ సర్కార్.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీకి రాసిన లేఖలో, ‘ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జరిగిన క్రూరత్వానికి సంబంధించి ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాత మమతా బెనర్జీ తరహాలో దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతారని అశించాను. కానీ ఒక్క అడుగు కూడా వేయలేదు. మీరు ఇప్పుడు వేసిన అడుగు చాలా ఆలస్యం అయింది. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన మమతాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
TMC Rajya Sabha MP Jawhar Sircar writes to West Bengal CM Mamata Banerjee, offers his resignation from the post of MP.
"I have suffered patiently for a month since the terrible incident at RG Kar Hospital, & was hoping for your direct intervention with the agitating junior… pic.twitter.com/vvgHt4066H
— ANI (@ANI) September 8, 2024
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సర్కార్ కూడా తన లేఖలో పార్టీలో అవినీతి అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలోని పంచాయితీ, మున్సిపల్ కార్పొరేషన్లలో స్థానిక స్థాయి పార్టీ నాయకులు భారీగా ఆస్తులు కూడబెట్టారని, దీని వల్ల బెంగాల్ ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆయన రాశారు. ఇతర పార్టీల నేతలు కూడా సంపన్నులు చేసిన మాట వాస్తవమే. కానీ బెంగాల్ ప్రజలు ఈ రకమైన అవినీతిని, ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోతున్నారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..