West Bengal: మెడికల్ కాలేజీలో 24 గంటల్లో 9 నవజాత శిశువులు మృతి.. ప్రమాదంలో మరి కొన్ని ప్రాణాలు..

|

Dec 08, 2023 | 10:36 AM

జిల్లాలోని జంగీపూర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పిల్లల ఆసుపత్రి. ఈ చిల్డ్రన్ హాస్పటల్ లో రోజూ భారీ సంఖ్యలో చిన్నారులు చికిత్స నిమిత్తం జేరతారు. అంతేకాదు ఇక్కడ చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే చిన్నారులకు కూడా చికిత్సనందిస్తారు.  అప్పుడే పుట్టిన శిశువుల హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉండి.. ఈ ఆసుపత్రిలో చికిత్స అందించలేని సమయంలో అప్పుడు అప్పుడే పుట్టిన శిశువులను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు.

West Bengal: మెడికల్ కాలేజీలో 24 గంటల్లో 9 నవజాత శిశువులు మృతి.. ప్రమాదంలో మరి కొన్ని ప్రాణాలు..
Murshidabad
Follow us on

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో మరణ మృదంగం మోగుతుంది.  గత 24 గంటల్లో 9 మంది చిన్నారులు మరణించారు. ఇంకా చాలా మంది నవజాత శిశువుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. వైద్య కళాశాలలోని ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో నవజాత శిశువులు మృతి చెందారు.  ఒకేసారి ఇంత భారీ  సంఖ్యలో నవజాత శిశువులు ఏకకాలంలో చనిపోవడంతో పశ్చిమ బెంగాల్ ఆరోగ్య వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే తమ చిన్నారుల మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలోని జంగీపూర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పిల్లల ఆసుపత్రి. ఈ చిల్డ్రన్ హాస్పటల్ లో రోజూ భారీ సంఖ్యలో చిన్నారులు చికిత్స నిమిత్తం జేరతారు. అంతేకాదు ఇక్కడ చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే చిన్నారులకు కూడా చికిత్సనందిస్తారు.  అప్పుడే పుట్టిన శిశువుల హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉండి.. ఈ ఆసుపత్రిలో చికిత్స అందించలేని సమయంలో అప్పుడు అప్పుడే పుట్టిన శిశువులను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు.

మెడికల్ కాలేజీపై పెరిగిన ఒత్తిడి

జిల్లాలో భారీ సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పినప్పుడు. అప్పుడు ఈ చిన్న ఆసుపత్రులు బాధిత చిన్నారులను మెడికల్ కాలేజీలకు పంపుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 100 మందికి పైగా చిన్నారులు

ఎస్‌ఎన్‌సియులో 52 పడకలు ఉన్నాయని ఆసుపత్రి యంత్రాంగం చెబుతోంది. 3 పిల్లలను ఒక మంచం మీద ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఇక్కడ 100 మందికి పైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి ప్రిన్సిపాల్ అమిత్ దాన్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఇప్పటికే ఓ కమిటీ వేసినట్లు చెప్పారు. దర్యాప్తు అనంతరం ఈ ఘటనలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..