తటస్థంగా లేకపోతే చర్యలు.. పోలీసులకు, హోం మంత్రిత్వ శాఖ అధికారులకు బెంగాల్ గవర్నర్ హెచ్చరిక

|

Feb 08, 2021 | 2:50 PM

West Bengal Governor Jagdeep Dhankhar: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నిత్యం బీజేపీ, టీఎంసీ కార్యకర్తలకు..

తటస్థంగా లేకపోతే చర్యలు.. పోలీసులకు, హోం మంత్రిత్వ శాఖ అధికారులకు బెంగాల్ గవర్నర్ హెచ్చరిక
Jagdeep Dhankhar
Follow us on

West Bengal Governor Jagdeep Dhankhar: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నిత్యం బీజేపీ, టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఏదో ఒకచోట ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ పోలీసులు, రాష్ట్ర హోంశాఖ అధికారులకు సోమవారం పలు హెచ్చరికలు చేశారు. రాజకీయాల్లో తలదూర్చితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా మందలించారు. పలుపార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ట్విట్ చేయడంతోపాటు ఈ ఆదేశాలను సైతం జారీ చేశారు.
రాజకీయ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసులు, హోంశాఖ అధికారులు రాజకీయంగా తటస్థంగా వ్యవహరించాలని సూచించారు. తటస్థంగా వ్యవహరించకుంటే పోలీసులపై చట్టపరమైన చర్యలు తప్పవని గవర్నర్ ధంకర్ పేర్కొన్నారు. రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. ఇదిలాఉంటే.. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కూడా అంతకుముందు వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రభుత్వంపై జగదీప్ ధంకర్ పలు ఆరోపణలు సైతం చేశారు.

Also Read:

బీజేపీ నేతపై ఇంకు పోసిన ఘటనపై కేసు నమోదు.. 17 మంది శివసేన కార్యకర్తల అరెస్ట్..

Coronavirus: పాఠశాలల్లో కరోనా భయం.. 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్.. ఎక్కడంటే..?