Dharmendra Pradhan: పశ్చిమబెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Dharmendra Pradhan: మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ రోజు అరెస్టు చేసింది. పశ్చిమబెంగల్‌ పర్యటనలో..

Dharmendra Pradhan: పశ్చిమబెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
Dharmendra Pradhan

Updated on: Jul 23, 2022 | 5:38 PM

Dharmendra Pradhan: మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమబెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ రోజు అరెస్టు చేసింది. పశ్చిమబెంగల్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆయన అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో దేశానికి స్ఫూర్తిగా నిలిచిన బెంగాల్‌.. యువత అభ్యంతరంతో అప్పటి విద్యాశాఖ మంత్రిపై ఛటర్జీపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆయన ఇంట్లో రూ.21 కోట్లు రికవరీ జరిగినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పరిస్థితి నేటి బెంగాల్‌ దుస్థితిని ప్రతిబింబిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. బెంగల్‌ సర్కార్‌ అవినీతిమయంగా మారుతోందని అన్నారు. స్కూల్‌ సర్వీస్‌ కమీషన్‌ (SSC) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియమాకాల్లో జరిగిన అవకతవకపై విచారణ జరిగిందని, ఇందులో భాగంగా ఛటర్జీతో పాటు అనేక మంది నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కోల్‌కతా ఉత్తర నియోజకవర్గంలోని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడి ఇంట్లో భోజనం చేసి కార్యకర్తలతో మాట్లాడారు.

 

ఇవి కూడా చదవండి

కాగా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఈ ఉపాధ్యాయ నియమకాల కుంభకోణంలో పార్థ ఛటర్జీ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీతో పాటు ఇతరుల ఇళ్లపై దాడులు నిర్వహించింది ఈడీ. పార్థ ఛటర్జీ ప్రస్తుతం బెంగాల్‌ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛటర్జీని దాదాపు ఒక రోజు పాటు విచారించిన తర్వాత అరెస్టు చేసింది. ఛటర్జీ ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

 

అయితే దాదాపు 26 గంటలపాటు పార్థ ఛటర్జీని విచారించిన తర్వాత అతడిని అరెస్టు చేశారు. అంతేకాకుండా సన్నిహితురాలుగా ఉన్న అర్పితా ముఖర్జీని కూడా ఈడీ విచారించి అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి