West Bengal Electionsl Date 2021: పశ్చిమబెంగాల్‌లో మోగిన ఎన్నికల నగారా.. మొత్తం 8 దశల్లో పోలింగ్‌.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

West Bengal Electionsl Date 2021: దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ...

West Bengal Electionsl Date 2021: పశ్చిమబెంగాల్‌లో మోగిన ఎన్నికల నగారా.. మొత్తం 8 దశల్లో పోలింగ్‌.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
ప్రతీకాత్మక చిత్రం

Updated on: Feb 26, 2021 | 5:56 PM

West Bengal Electionsl Date 2021: దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా వెల్లడించారు. అలాగే 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికకూ షెడ్యూల్‌ విడుదలైంది. ఇక బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరనుగన్నాయి. అలాగే 80 ఏళ్లుపైబడిన వృద్ధులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌గా సీఈసీ ప్రకటించారు. అయితే ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే మొత్తం 8 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021

మొదటి దశ- 27 మార్చి
2వ దశ – 1 ఏప్రిల్
3వ దశ – 6 ఏప్రిల్
4వ దశ – 10 ఏప్రిల్
5 వ దశ – 17 ఏప్రిల్
6వ దశ -22 ఏప్రిల్
7 వ దశ-26 ఏప్రిల్
8 వ దశ -29 ఏప్రిల్,
ఓట్ల లెక్కింపు – 2 మే

Aslo Read:

Assam Elections Date 2021: ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. అసోంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Assembly Election 2021 Date LIVE: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీల ప్రకటన …

Follow Us