One Nation One Poll: జమిలి ఎన్నికలకు మేము వ్యతిరేకం.. న్యాయశాఖ సెక్రటరీకి బెంగాల్‌ సీఎం మమత లేఖ

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంటే నియంతృత్వమే అని మమత విమర్శించారు. దీనిని తమ పార్టీ వ్యతిరేకిస్తునట్టు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో దీదీ పేర్కొన్నారు. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి పూర్తిగా విరుద్దమన్నారు.

One Nation One Poll: జమిలి ఎన్నికలకు మేము వ్యతిరేకం.. న్యాయశాఖ సెక్రటరీకి బెంగాల్‌ సీఎం మమత లేఖ
Mamata Banerjee

Updated on: Jan 11, 2024 | 3:55 PM

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంటే నియంతృత్వమే అని మమత విమర్శించారు. దీనిని తమ పార్టీ వ్యతిరేకిస్తునట్టు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో దీదీ పేర్కొన్నారు. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి పూర్తిగా విరుద్దమన్నారు. జమిలి ఎన్నికలపై ఇప్పటికే కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో, సంస్థలతో చర్చలు జరుపుతోంది.

ఈ నేపథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఒకే దేశం ఒకే ఎన్నికను అంగీకరించడం లేదని మరోసారి స్పష్టం చేశారు. న్యాయశాఖ కార్యదర్శికి లేఖ రాసి తన నిరసనను తెలియజేశారు. మమత తన లేఖలో, ‘ప్రస్తుత పరిస్థితుల్లో రూపొందించిన ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే భావనతో ఏకీభవించనందుకు చింతిస్తున్నాను. మీ ప్రతిపాదన, సూత్రీకరణతో మేము అంగీకరించము. మీ లేఖలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ స్పష్టంగా లేదు అంటూ లేఖలో పేర్కొన్నారు.

నిజానికి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’కు సంబంధించి ఒక కమిటీని వేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా కమిటీ సభ్యులుగా అమిత్ షా, అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీలను నియమించారు. అయితే, కమిటీలో భాగం కావడానికి నిరాకరిస్తూ లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ఏకకాల ఎన్నికలకు మద్దతుగా నిలిచారు. 2018 జనవరి 29న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్ మాట్లాడుతూ, దేశంలోని పాలనా స్థితితో సతమతమవుతున్న పౌరులు, భారతదేశంలోని ఏదో ఒక ప్రాంతంలో తరచూ ఎన్నికలు జరుగుతాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ప్రతికూలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల మానవ వనరులపై పెనుభారం పడటమే కాకుండా మోడల్ ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం వల్ల అభివృద్ధి ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల, ఏకకాల ఎన్నికల అంశంపై నిరంతరం చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఇందులో నిమగ్నమై ఉండాలి అంటూ రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు.

1967 వరకు ఏకకాలంలో ఎన్నికలు

స్వతంత్ర భారతదేశంలో, ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. అయితే, ఈ విషయం కొన్ని నివేదికలు మొదలైన వాటికి మించి ఎప్పుడూ ముందుకు సాగలేదు. ఇంకొంచెం వెనక్కి వెళితే, భారతదేశంలో 1967 వరకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ధోరణి ఉండేదన్నది కూడా వాస్తవం. కానీ 1968, 1969లో కొన్ని శాసనసభలు, 1970 డిసెంబరులో లోక్‌సభ రద్దు అయిన తర్వాత విడివిడిగా ఎన్నికలు జరుగాయి. అయితే, 1983లో ఎన్నికల సంఘం వార్షిక నివేదికలో మళ్లీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కల్పించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా మరోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రస్తావనను ముందుకు తీసుకువ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…