Mamata Banerjee: మమతా కోసం ఓ ఎమ్మెల్యే రాజీనామా.. దీదీ పోటీ చేసేది ఎక్కడి నుంచి అంటే..!

|

May 21, 2021 | 5:45 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.

Mamata Banerjee: మమతా కోసం ఓ ఎమ్మెల్యే రాజీనామా.. దీదీ పోటీ చేసేది ఎక్కడి నుంచి అంటే..!
Follow us on

Mamata from Bhabanipur Constituency: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఆమె పోటీ చేసేందుు వీలుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఆమె నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి తన పాత మిత్రుడు సువేందు అధికారి చేతిలో పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. కాగా, తాను నాయకత్వం వహిస్తున్న తృణమూల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. దీంతో మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆమె బెంగాల్ సీఎం పదవి చేపట్టినప్పటికీ.. నిబంధనల ప్రకారం మమత ఆరుమాసాల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాలి. తన పాత నియోజకవర్గమైన కోల్‌కతాలోని భవానీపూర్ నుంచే ఆమె అసెంబ్లీకి పోటీచేయబోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆ స్థానంలో తృణమూల్ అభ్యర్థిగా శోభన్‌దేబ్ చటోపాధ్యాయ పోటీచేసి గెలిచారు. పార్టీ అధినేత్రి కోసం ఆయన ఆ సీటుకు రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నమే ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ బిమాన్ బంధోపాధ్యాయకు అందజేశారు. ప్రస్తుతం శోభన్‌దేబ్ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఆరునెలల్లోగా మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరుమాసాల్లోగా ఎన్నిక కావాలి లేదా రాజీమానా చేయాలి అని రాజ్యాంగంలోని 164వ అధికరణం చెబుతోంది.

కాగా, భవానీపూర్‌లో శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయకు ఈ ఎన్నికల్లో 57.71 శాతం ఓట్లు లభించాయి. తన పాత నియోజకవర్గమైన కోల్‌కతాలోని భవానీపూర్ నుంచే ఆమె అసెంబ్లీకి పోటీచేయబోతున్నారని నిర్థారణ అయ్యింది.

Read Also…  Bail to MP RRR: రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం