AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం.. తలకు గాయంతో ఆస్పత్రిలో చేరిన మమతా బెనర్జీ !!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం కోసం ..కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలోని పుర్బా బర్ధమాన్‌లో జరిగిన పరిపాలనా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించేందుకు మమత వెళ్లారు. అక్కడ అధికారుల సమీక్ష అనంతరం విమానంలో బయల్దేరి రావాల్సి ఉండగా వర్షం పడింది.. దాంతో హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు చేసుకునని కారులో రోడ్డు మార్గాన బయలుదేరారు.

Car Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం.. తలకు గాయంతో ఆస్పత్రిలో చేరిన మమతా బెనర్జీ !!
Mamata Banerjee
Jyothi Gadda
|

Updated on: Jan 24, 2024 | 7:31 PM

Share

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లుగా అధికారులు వెల్లడించారు. బర్ధమాన్ నుంచి కోల్ కత్తా తిరిగి వస్తుండగా మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె కారు మరో కారును ఢీకొట్టకుండా ఉండేందుకు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో మమతా బెనర్జీకి గాయాలయ్యాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం కోసం తూర్పు బర్ధమాన్ వెళ్లారు. కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలోని పుర్బా బర్ధమాన్‌లో జరిగిన పరిపాలనా సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించేందుకు మమత వెళ్లారు. అక్కడ అధికారుల సమీక్ష అనంతరం విమానంలో బయల్దేరి రావాల్సి ఉండగా వర్షం పడింది.. దాంతో హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు చేసుకునని కారులో రోడ్డు మార్గాన బయలుదేరారు. ఈక్రమంలోనే వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మమతకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. డ్రైవర్ పక్కన ముందు సీటులో కూర్చున్న మమతా బెనర్జీ తల విండ్‌స్క్రీన్‌కు తగిలిందని ఓ అధికారి తెలిపారు.

బర్ధమాన్‌లో వర్షంతో పాటు దట్టమైన పొగమంచు పడుతోంది. దాంతో రహదారి మార్గంలో వాహనాలు దగ్గరకు వచ్చేవరకు కనిపించటం లేదు..ఈ పరిస్థితులలో మమతా ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్ట బోయింది. ఈ క్రమంలోనే డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయటంతో..ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మమతా బెనర్జీ తలపై స్వల్ప గాయాలు కావడంతో ఆమెను కోల్‌కతాకు తీసుకొచ్చారు. కోల్‌కతాలో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు.

మమతా బెనర్జీ కారు ప్రమాదంలో గాయపడినట్లు తెలియటంతో..ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రేపు బెంగాల్‌లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో నయ్ యాత్రకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆయన పోస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..