అగ్నికి ఆహుతైన బీజేపీ కార్యాలయం..!

వెస్ట్ బెంగాల్‌‌లో ఆదివారం దుండగులు రెచ్చిపోయారు. అసోన్‌సోల్ జిల్లా సలాన్పూర్ గ్రామంలో ఉన్న బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, బీజేపీ అధికారులు మాత్రం ఇదంతా […]

అగ్నికి ఆహుతైన బీజేపీ కార్యాలయం..!

Edited By:

Updated on: Jan 13, 2020 | 12:35 PM

వెస్ట్ బెంగాల్‌‌లో ఆదివారం దుండగులు రెచ్చిపోయారు. అసోన్‌సోల్ జిల్లా సలాన్పూర్ గ్రామంలో ఉన్న బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, బీజేపీ అధికారులు మాత్రం ఇదంతా తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే గతకొద్ది రోజులుగా అధికార టీఎంసీ పార్టీకి.. బీజేపీకి మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి.