West Bengal SSC Scam: మంత్రి స్నేహితురాలి ఇంట్లో నోట్ల కట్టలే కట్టలు.. మరో 20 కోట్లు, 3 కిలోల బంగారం స్వాధీనం

|

Jul 28, 2022 | 7:28 AM

అర్పితా ముఖర్జీకి చెందిన రెండో అపార్ట్‌మెంట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ. 21 కోట్లు రికవరీ చేసిన రోజుల తర్వాత మరో రూ.20 కోట్ల నగదును కనుగొంది . అపార్ట్‌మెంట్‌లో రూ.2 కోట్ల విలువైన 3 కిలోల బంగారం కూడా అధికారులు గుర్తించారు. ఇంకా డబ్బు లెక్కింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

West Bengal SSC Scam: మంత్రి స్నేహితురాలి ఇంట్లో నోట్ల కట్టలే కట్టలు.. మరో 20 కోట్లు, 3 కిలోల బంగారం స్వాధీనం
Ed Raids Partha Chatterjee
Follow us on

West Bengal SSC Scam: పశ్చిమ బెంగాల్ లోని ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది.  ఇప్పటికే మంత్రి మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసిన అధికారులు.. మంత్రి స్నేహితురాలు.. సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ అధికారులు మరోసారి దాడులు చేశారు. ఈసారి కూడా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అర్పితాముఖర్జీ ఇంట్లో గతంలో రూ.21 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. తాజాగా భారీ మొత్తంలో నగదు వెలుగులోకి వచ్చి సంచలనం రేపింది. మరోసారి నగదు కుప్పలు కుప్పలుగా ఈడీ అధికారులకు లభించింది. అర్పితా ముఖర్జీకి చెందిన రెండో అపార్ట్‌మెంట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ. 21 కోట్లు రికవరీ చేసిన రోజుల తర్వాత మరో రూ.20 కోట్ల నగదును కనుగొంది . అపార్ట్‌మెంట్‌లో రూ.2 కోట్ల విలువైన 3 కిలోల బంగారం కూడా అధికారులు గుర్తించారు. ఇంకా డబ్బు లెక్కింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొదటిసారి చేసిన దాడిలో రూ.21.90 కోట్ల నగదు లభించింది. అంతేకాదు రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం దొరికింది. మొత్తం స్వాధీనం రూ.23.22 కోట్లను ఈడీ అధికారులు గుర్తించారు. దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది . అంతేకాదు ఇప్పటికీ అధికారులు  నగదు,  కోట్ల విలువైన బంగారు వస్తువులను లెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.45.22 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ED కస్టడీలో అర్పితా ముఖర్జీ
అర్పితా ముఖర్జీ తన ఇంటి నుండి రికవరీ చేసిన నగదు బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదని దర్యాప్తులో భాగంగా ED కి చెప్పారు. తనకు సంబంధించిన కంపెనీల్లో డబ్బులను దాచినట్లు పేర్కొంది. అంతేకాదు తన ఇంట్లో ఉన్న నగదును, బంగారాన్ని తన ఇంటి నుండి ఒకటి లేదా రెండు రోజుల్లో తరలించాలని ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. అయితే హఠాత్తుగా ఈడీ అధికారులు దాడులు చేయడంతో తమ ప్లాన్ను విఫలం అయిందని చెప్పింది.  తన ఇంట్లోని ఒక గదిలో పార్థా ఛటర్జీ డబ్బు దాచేవారని.. ప్రతి పదిరోజులలొకసారి ఛటర్జీ మా ఇంటికి వచ్చేవారని తెలిపింది. డబ్బులు దాచేందుకు తన ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకులా ఉపయోగించుకున్నారనీ పేర్కొంది. అర్పిత ఇంట్లో అధికారులు 40 పేజీల డైరీని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..