AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ రాజకీయంలో కొత్త ప్రకంపనలు.. మమత భేటీకి 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (TMC) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తన కాళీఘాట్ నివాసంలో అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 10 మంది గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బెంగాల్ రాజకీయంలో కొత్త ప్రకంపనలు.. మమత భేటీకి 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా..!
Mamata Banerjee High Stakes Meeting
Balaraju Goud
|

Updated on: May 07, 2026 | 3:59 PM

Share

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (TMC) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తన కాళీఘాట్ నివాసంలో అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించారు. అయితే, ఈ సమావేశానికి పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 10 మంది గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

10 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంపై అనేక ఊహాగానాలు చెలరేగగా, టీఎంసీ నాయకత్వం వెంటనే స్పందించింది. పార్టీలోని విభేదాల వల్లే వారు రాలేదన్న వార్తలను ఖండిస్తూ వివరణ ఇచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీయే ఆదేశించింది. మరికొందరు వైద్య అత్యవసర పరిస్థితులు మరియు వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేదని స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో మమతా బెనర్జీ భావోద్వేగంగా ప్రసంగించారు. బీజేపీ అక్రమాలకు పాల్పడి అసెంబ్లీ ఎన్నికలను దొంగిలించిందని ఆమె మండిపడ్డారు. ఓట్ల లెక్కింపులో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమె ప్రకటించారు. అంతేకాకుండా, సొంత పార్టీలోని కొందరు సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని మమత ఆవేదన వ్యక్తం చేశారు. “నా సొంత మనుషులే నాకు హాని తలపెట్టారు, ఈ ద్రోహాన్ని ఉపేక్షించబోము” అని ఆమె హెచ్చరించారు.

పార్టీలో అంతర్గత ప్రక్షాళన కోసం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపై విచారణ జరిపేందుకు డెరెక్ ఓ’బ్రియన్, ఫిర్హాద్ హకీం, చంద్రమా భట్టాచార్య, అసిమా పాత్రలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే, ఎన్నికల తర్వాత అశాంతి నెలకొన్న జిల్లాల్లో పర్యటించేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మొత్తానికి, ఈ సమావేశం టీఎంసీలో మున్ముందు రాబోయే భారీ మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ఒకవైపు బీజేపీపై న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు సొంత గూట్లోని శత్రువులను ఏరివేసే పనిలో మమతా బెనర్జీ నిమగ్నమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
ఇంతకీ.. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ..?
ఇంతకీ.. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ..?
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే కూరగాయ మొక్కలు ఇవేనా?
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే కూరగాయ మొక్కలు ఇవేనా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా?
ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్న స్వింగ్ కింగ్
ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ సృష్టించబోతున్న స్వింగ్ కింగ్
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
సింగరకొండ ఆంజనేయుడు.. గుమ్మం దగ్గరే 99 అడుగుల మహావిగ్రహం! వాహన...
ల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
ల్లెచెట్టు చిన్నదైనా కొమ్మకొమ్మకి విపరీతంగా పూలు పూయాలంటే
మనోవేదనలోనూ మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులు..!
మనోవేదనలోనూ మానవత్వం చాటుకున్న తల్లిదండ్రులు..!
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.లక్షకు రూ.14 లక్షలు..ఇన్వెస్టర్లకు పండగే
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
ఏంట్రా ఇలా ఉన్నావ్.. అప్పుగా సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పోడిచాడు..
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!
మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు రాత్రి వృద్ద దంపతుల మృతి!