యువతి పాడు పని.. ప్రియుడు చెప్పాడని హాస్టల్ బాత్రూమ్‌లో

|

Dec 01, 2023 | 2:38 PM

ఐఈఎల్‌టీఎస్‌కు సిద్ధమవుతున్న సహరాన్‌పూర్‌కు చెందిన యువతి ఆరు నెలలుగా పీజీలో ఉంటోందని పోలీసులు తెలిపారు. ఆమె ప్రియుడు అమిత్ హండా, సెక్టార్ 21 నివాసిగా గుర్తించారు. మూడు అంతస్తుల ఇంటిలో పీజీ నిర్వహిస్తున్నారు. యజమాని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, మిగిలిన రెండు అంతస్తులు పేయింగ్ గెస్ట్‌ల కోసం కేటాయించారు.

యువతి పాడు పని.. ప్రియుడు చెప్పాడని హాస్టల్ బాత్రూమ్‌లో
Web Camera
Follow us on

చండీగఢ్‌లో ఓ యువతి తప్పుడు పని చేసింది. ప్రియుడు అడిగాడని.. తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలోని బాత్‌రూమ్‌ గీజర్‌లో వెబ్‌క్యామ్‌ పెట్టింది. ఈ క్యామ్‌ను వైఫై ద్వారా ఆపరేట్ చేసి, మొబైల్ ఫోన్‌కి లింక్ చేశారు. దాంతో యువతుల వీడియోలను ఎవరి కంటా పడకుండా చిత్రీకరించేవారు.  కెమెరాను ఇటీవల ఓ అమ్మాయి గుర్తించి పీజీ నిర్వాహకులకు కంప్లైంట్ చేసింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెబ్‌కెమెరాను అమర్చిన యువతితోపాటు ఆమె ప్రియుణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కెమెరా, స్వాధీనం చేసుకున్న ఫోన్‌లను సెక్టార్ 36లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. సెక్టార్ 22లోని పీజీ వసతి గృహంలో ఈ సంఘటన జరిగింది.

IELTSకు సిద్ధమవుతున్న సహరాన్‌పూర్‌కు చెందిన యువతి ఆరు నెలలుగా పీజీలో ఉంటోందని పోలీసులు తెలిపారు. ఆమె ప్రియుడు అమిత్ హండా, సెక్టార్ 21 నివాసిగా గుర్తించారు. మూడు అంతస్తుల ఇంటిలో పీజీ నిర్వహిస్తున్నారు. యజమాని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, మిగిలిన రెండు అంతస్తులు పేయింగ్ గెస్ట్‌ల కోసం కేటాయించారు. మహిళలు మాత్రమే ఉండే పీజీలో పై అంతస్తులో ఐదుగురు యువతులు ఉంటున్నారు. వెబ్ క్యామ్ ద్వారా రికార్డు చేసిన వీడియోలు సర్కులేట్ కాలేదని, డివైజ్‌లోని అన్ని రికార్డింగ్‌లను తొలగించామని పోలీసులు తెలిపారు.

అమిత్ హండా సెక్టార్ 45 బురైల్‌లోని ఓ దుకాణం నుంచి వెబ్‌క్యామ్‌ను కొనుగోలు చేసిం తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “పీజీ ఎంట్రన్స్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు దర్యాప్తును సులభతరం చేశాయి. ఫుటేజ్ ద్వారా ఇది లోపల ఉండేవాళ్ల పనే అని గుర్తించాం. అనుమానిత యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. ఆమె నేరాన్ని అంగీకరించింది.  ప్రియుడి  గురించి వివరాలను వెల్లడించింది” అని తెలిపారు.

ఘటనపై సెక్టార్ 17 పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354 , 506, 509, 120బి (కుట్ర), ఐటి చట్టంలోని సెక్టార్ 66ఇ కింద కేసు నమోదు అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.