దట్టమైన పొగమంచుతో నిండిన ఉత్తర భారతం.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ..!

ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న మంచు చుక్కలు చూపిస్తోంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జలవనరులు ఉన్న ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చలికి నీళ్లే గడ్డ కట్టుకుపోతున్నాయి.

దట్టమైన పొగమంచుతో నిండిన ఉత్తర భారతం.. పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ..!
Cold Weather Red Alert

Updated on: Dec 22, 2025 | 7:17 AM

ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌లో కురుస్తున్న మంచు చుక్కలు చూపిస్తోంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జలవనరులు ఉన్న ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చలికి నీళ్లే గడ్డ కట్టుకుపోతున్నాయి. గుల్‌మార్గ్‌లోని స్కై రిసార్ట్‌, సోనామార్గ్‌, దూద్‌పత్రి సహా దక్షిణ, ఉత్తర కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో అక్కడి వాళ్లు గజగజ వణుకుతున్నారు.

ఇటు కశ్మీర్‌ అంతటా పరుచుకున్న మంచు దుప్పటి ఓ వైపు పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. మరోవైపు భారీగా మంచు పేరుకుపోయి పెద్ద సంఖ్యలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు చలికి తోడు అక్కడక్కడా వర్షం కూడా కురుస్తుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే శీతాకాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ హిమపాతాన్ని ఎదుర్కోవడం, రోడ్ క్లియరెన్స్, నిరంతర విద్యుత్తు సరఫరా, తాగునీటి లభ్యత వంటి వాటిపై దృష్టి సారించినట్లు సీఎం పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..