హిజాబ్‌పై సంచలన తీర్పును వెల్లడించింది కర్నాటక హైకోర్టు. హిజాబ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. విద్యాసంస్థల ప్రోటోకాల్ అనుసరించాల్సిదేనని వెల్లడించింది. కర్ణాటకలో హిజాబ్ (Karnataka Hijab Row) రగడ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై వివాదం..తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. మరోవైపు హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. మరోవైపు హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత జస్టిస్ కృష్ణ దీక్షిత్‌తో ఏర్పాటైన ఏకసభ్య ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై ఫిబ్రవరి 10న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించి.. పదిహేను రోజుల పాటు వాదనలు వినింది. ఇదే సమయంలో సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం.. మంగళవారం తుది తీర్పు వెలువరించింది.
Karnataka High Court dismisses various petitions challenging a ban on Hijab in education institutions pic.twitter.com/RK4bIEg6xX
— ANI (@ANI) March 15, 2022
కర్ణాటకలో హిజాబ్ రగడ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై వివాదం..తీవ్ర సంచలనం సృష్టించింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు జరిగాయి. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్ట్..సంచలన తీర్పు వెలువరించింది. మరోవైపు హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
తీర్పును గౌరవిస్తాం-కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై
హైకోర్ట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. ప్రతి ఒక్కరూ హైకోర్ట్ ఆదేశాలు పాటించాలన్నారు. శాంతిని కాపాడాలని..విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
హిజాబ్ ధరిస్తే ఎవరికి ఇబ్బంది..
హిజాబ్‌ను కర్నాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని అన్నారు మజ్లిస్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ . ముస్లిం బాలికలు హిజాబ్ ధరిస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. హిజాబ్ బ్యాన్‌పై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని పిటిషనర్లకు పిలుపునిచ్చారు ఒవైసీ.
ఇవి కూడా చదవండి: Wi-Fi Repeater: వైఫై రూటర్‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..