Farmers Protest: భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే ట్రాక్టర్ ర్యాలీని ఉపసంహరించుకుంటామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిథి రాకేష్ తికాయత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత గణతంత్ర దినోత్సవం రోజున భారీ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ రైతు చట్టాలపై కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య తొమ్మిదో విడత చర్చలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సుప్రీంకోర్టు ఆదేశిస్తే ప్రతిపాదిత ట్రాక్టర్ పరేడ్‌ను రద్దు చేసుకుంటామని చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజున కాకుండా మరో రోజు ట్రాక్టర్ ర్యాలీని చేపడతామని రాకేష్ తికాయత్ తెలిపారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన కమిటీపై తికాయత్ స్పందించారు. ఆ కమిటీతో చర్చలు జరపడం కంటే.. ప్రభుత్వంతో చర్చలు జరుపడే బెటర్ అని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం ఎన్ని దఫాలు చర్చలు జరిపినా.. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also read: