మందు మానాలంటూ ప్రచారం చేస్తాం.. లిక్కర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేస్తాం. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఆల్కహాలు నుంచి విముక్తం చేయాల్సి ఉందని ఈ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దీన్ని దేశంలో..

మందు మానాలంటూ ప్రచారం చేస్తాం.. లిక్కర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేస్తాం. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 07, 2021 | 1:07 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఆల్కహాలు నుంచి విముక్తం చేయాల్సి ఉందని ఈ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దీన్ని దేశంలో ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. కట్ని జిల్లాలో ఆదివారంజరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మద్య నిషేధాన్ని అమలు చేసేముందు మొదట మద్యం మంచిది కాదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉందన్నారు. లిక్కర్ ముట్టుకోబోమని మద్యం ప్రియులకు నచ్ఛజెప్పాలని, క్రమంగా తాగుడుకు వారిని దూరం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇందుకు తాము తొలుత ప్రభుత్వ పరంగా తీర్మానం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చౌహాన్ తెలిపారు. రానున్న మూడేళ్ళలో ఈ జిల్లాలోప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ఆయన హామీ ఇఛ్చారు.  ఇక్కడ బాలికల సంరక్షణకు ముస్కాన్ అభియాన్ అనే పథకాన్ని చేబట్టామని, దీనికింద ఇప్పటివరకు 50 మంది బాలికలను రక్షించడం జరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

రాష్ట్రంలో మహిళలు, యువతులు, బాలికల భద్రత, రక్షణకు తమ ప్రభుత్వం వివిధ చర్యలు చేబట్టిందన్నారు. ఈ రాష్ట్ర కూతుళ్ళకు ప్రభుత్వం నుంచి ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుందని ఆయనపేర్కొన్నారు. వీరిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవారికి కఠిన శిక్షలు అమలు చేసే రాష్ట్రం దేశంలో తమదే మొదటి స్టేట్ అని చౌహాన్ చెప్పారు.

Read More:

పుట్టకముందే శిశువుని అమ్మకానికి పెట్టిన అమ్మ.. పుట్టిన తర్వాత ఎవరో ఎత్తుపోయారని నాటకం.. ఎక్కడో తెలుసా..!

రైతులు మీకు గాంధీ జయంతి వరకు గడువునిచ్చారు..ఇప్పటికైనా స్పందించండి.. రాహుల్ గాంధీ.