PM Modi: మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా "భిన్నత్వంలో ఏకత్వానికి" ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.. పేదలు, ధనవంతులు ఇలా అంతా కుంభ్‌లో ఏకమవుతారన్నారు.. చారిత్రాత్మకమైన మతపరమైన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని.. మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని ప్రధాని మోదీ కోరారు.

PM Modi: మహా కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Pm Modi

Updated on: Jan 19, 2025 | 12:42 PM

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా “భిన్నత్వంలో ఏకత్వానికి” ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.. పేదలు, ధనవంతులు ఇలా అంతా కుంభ్‌లో ఏకమవుతారన్నారు.. చారిత్రాత్మకమైన మతపరమైన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంపై ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘యువ తరం దాని నాగరికతతో అనుసంధానం అయినప్పుడు, దాని మూలాలు బలపడతాయి.. దీంతో బంగారు భవిష్యత్తుకు భరోసా ఉంటుంది’ అని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇది ఈ సంవత్సరం మొదటి ఎపిసోడ్.. ఈ రేడియో కార్యక్రమంలో 118వ ఎపిసోడ్.. వాస్తవానికి, ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నెలలో చివరి ఆదివారం ప్రసారం అవుతుంది.. కానీ ఈసారి చివరి ఆదివారం జనవరి 26 వస్తుంది.. గణతంత్ర దినోత్సవం రోజున వస్తుండటంతో ప్రధాని మోదీ ముందే (జనవరి 19న) మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా మహాకుంభ్, అంతరిక్షం, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట నుంచి గణతంత్ర దినోత్సవం వరకు.. ఎన్నో విషయాల గురించి ప్రసంగించారు.

ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే

మన్ కీ బాత్ ప్రతిసారీ నెలలో చివరి ఆదివారం జరుగుతుందని మీరు ఒక విషయం గమనించి ఉంటారు.. అయితే ఈసారి వారం ముందు నాలుగో ఆదివారం కాకుండా మూడో ఆదివారం నిర్వహిస్తున్నాము.. ఎందుకంటే వచ్చే ఆదివారం గణతంత్ర దినోత్సవం వస్తుంది.. ముందుగా దేశప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. అంటూ ప్రధాని మోదీ అన్నారు.

ఈసారి ‘గణతంత్ర దినోత్సవం’ చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఇది భారత గణతంత్ర 75వ వార్షికోత్సవం. ఈ ఏడాది రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. మన పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులందరికీ నేను నమస్కరిస్తున్నానంటూ మోదీ పేర్కొన్నారు.

మహాకుంభ పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన వేడుక అని ప్రధాని మోదీ అన్నారు. కుంభ సంప్రదాయం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుంది.. మహాకుంభ్‌లో యువత భాగస్వామ్యం పెరిగింది. ఈ సందర్భంగా గంగాసాగర్ జాతరను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. గంగాసాగర్ జాతర సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు.

అయోధ్యలోని రామ మందిరంలో రామ లల్లాకు ప్రతిష్ఠాపన జరిగిన మొదటి వార్షికోత్సవంపై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు.. ప్రాణ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. వారసత్వాన్ని కాపాడుకోవాలని, స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు.

అంతరిక్ష సాంకేతికతలో దేశం కొత్త పుంతలు తొక్కుతున్నదని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ అన్నారు. PIXXEL ప్రైవేట్ ఉపగ్రహం ఒక పెద్ద అచీవ్‌మెంట్ అని ప్రధాని మోదీ అన్నారు. స్పేస్ డాకింగ్ విజయవంతం అయినందుకు ఇస్రోను ప్రధాని మోదీ అభినందించారు. స్పేస్ డాకింగ్ చేసిన ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ అవతరించిందన్నారు.

జనవరి 25ని జాతీయ ఓటర్ల దినోత్సవం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజున భారత ఎన్నికల సంఘం స్థాపించబడింది. మన రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల కమిషన్‌కు, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఎన్నికల సంఘం మన ఓటింగ్ ప్రక్రియను ఆధునీకరించింది.. బలోపేతం చేసిందంటూ చెప్పారు..

స్టార్టప్ ఇండియా కొద్ది రోజుల క్రితమే 9 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 9 సంవత్సరాలలో మన దేశంలో సృష్టించబడిన స్టార్టప్‌లలో సగానికి పైగా టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందినవని.. ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం సంతోషిస్తుందన్నారు.. మన స్టార్టప్ సంస్కృతి పెద్ద నగరాలకే పరిమితం కాదని.. అన్ని చోట్లకు వస్తరిస్తుందని తెలిపారు.

ప్రధాని మోదీ వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..