విదేశాల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే యోచన, సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడి

| Edited By: Phani CH

May 01, 2021 | 3:17 PM

వ్యాక్సిన్ కోసం పెరిగిపోతున్న డిమాండును తీర్చేందుకు విదేశాల్లో ఆస్ట్రాజెనికా టీకామందును ఉత్పత్తి చేసే యోచన ఉందని సీరం కంపెనీ  సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు.

విదేశాల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే యోచన, సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడి
Adar Poonawalla
Follow us on

వ్యాక్సిన్ కోసం పెరిగిపోతున్న డిమాండును తీర్చేందుకు విదేశాల్లో ఆస్ట్రాజెనికా టీకామందును ఉత్పత్తి చేసే యోచన ఉందని సీరం కంపెనీ  సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. మరికొన్ని రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామన్నారు. జులై నాటికి తమ సంస్థ నెలకు 100 మిలియన్ డోసులను ఉత్పత్తి చేయగలదని ఆయన  ఓ ఇంటర్వ్యూ లో  వెల్లడించారు, ఆరు నెలల్లోగా తమ ఉత్పాదక సామర్థ్యాన్ని సంవత్సరానికి 2.5 బిలియన్ డోసుల నుంచి 3 బిలియన్ డోసులకు  పెంచుకోగలమని  ఆశిస్తున్నామన్నారు.ఇండియాలో కోవిడ్ కేసులు  పెరిగిపోతున్నాయని, ఈ సమయంలో తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇలా ఉండగా విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు రాపిడ్ రెస్ట్ కిట్స్ మొదలైనవి అందుతున్నా యుధ్ద ప్రాతిపదికన వీటిని వినియోగించుకోవడంలో ప్రభుత్వం ఎందుకో జాప్యం చేస్తోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా నుంచి సుమారు 10 కోట్ల డాలర్ల విలువైన సాయం అందిన సంగతి విదితమే. ఆ దేశం నుంచి ఈ సామగ్రితో  కూడిన  విమానాలు ఢిల్లీ విమానాశ్రయంలో  దిగాయి.ఇప్పటికే దేశంలో కోవిడ్ కేసులు 4 లక్షలకు పైగా పెరగగా 24 గంటల్లో మూడున్నర వేలమంది రోగులు మరణించారు. ఈ నెల మొదటి వారంలో కేసులు ఇంకా పెరగవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటు-నేటికీ ఢిల్లీలోని పలు హాస్పిటల్స్ తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి, ఉదాహరణకు బాత్రా ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నరోగులు కొందరు మరణించగా వారిలో ఓ డాక్టర్ కూడా  ఉన్నారని  ఆసుపత్రి యాజమాన్యం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆక్సిజన్ పూర్తిగా అయిపోయిందని, కానీ ఒకటిన్నర గంటలకు ఆక్సిజన్ అందిందని వెల్లడించింది. సుమారు 80 నిముషాలసేపు ఆక్సిజన్ లేక రోగులు అల్లాడిపోయారని పేర్కొంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కర్నూలు కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో దారుణం.. 8 మంది కరోనా రోగులు మృతి.. ఆక్సిజన్‌ అందకే చనిపోయారంటున్న బాధిత బంధువులు

Sputnik V vaccine: మరికాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్న స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు