Dark Tourism: డార్క్‌ టూరిజంపై ఫోకస్‌ కేరళ పోలీసులు.. వాళ్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్.. డార్క్ టూరిజం అంటే ఏమిటంటే?

|

Aug 02, 2024 | 6:50 AM

కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయాయి. ఇలాంటి టైమ్‌లో డార్క్‌ టూరిజం అనే అంశం తెరపైకొచ్చింది. డార్క్‌ టూరిజంపై కేరళ పోలీసులు సైతం రియాక్ట్‌ అవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Dark Tourism: డార్క్‌ టూరిజంపై ఫోకస్‌ కేరళ పోలీసులు.. వాళ్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్.. డార్క్ టూరిజం అంటే ఏమిటంటే?
Kerala Police Focus On Dark Tourism
Follow us on

కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారిన ప్రాంతాల్లో.. అన్వేషణ, సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదినక కొనసాగుతున్నాయి. బురద, శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మూడు వందలకు చేరువుతోంది. ఇలాంటి టైమ్‌లో డార్క్‌ టూరిజం అనే అంశం తెరపైకొచ్చింది. డార్క్‌ టూరిజంపై కేరళ పోలీసులు సైతం రియాక్ట్‌ అవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. అసలింతకీ డార్క్‌ టూరిజం అంటే ఏంటి? ఈ రోజు తెలుసుకుందాం..

కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయాయి. ముండక్కైలో 150 వరకు ఇళ్లు ఉండగా.. వాటిల్లో 65 పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. శిథిలాలను తొలగిస్తేగానీ లోపల ఎంత మంది ఉన్నారనేది తెలియదని సహాయక బృందాలు చెబుతున్నాయి.

వయనాడ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నప్పటికీ ఓవైపు ఆర్మీ, మరోవైపు పోలీసు బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్‌ చేస్తూ… ఇప్పటికే దాదాపు వెయ్యి మందికిపైగా స్థానికులను సురక్షితంగా కాపాడారు. మరోవైపు డార్క్‌ టూరిజంపైనా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విపత్తు ప్రాంతాలను సందర్శించొద్దని, అలా చేస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని ఎక్స్ ద్వారా హెచ్చరిస్తున్నారు పోలీసులు. దీంతో డార్క్‌ టూరిజం అన్న పదం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరణం, విషాదం, హింస, అసాధారణమైన సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించడాన్నే డార్క్ టూరిజం అనంటారు. ఇందులో స్మశానవాటికలు, సమాధులు, మార్చురీలు, విపత్తు ప్రాంతాలు, యుద్దభూములు, ఉరితీసే ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాల చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలని… అక్కడి విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారి ఉద్వేగాలతో కనెక్ట్ అయ్యేందుకు డార్క్‌ టూరిస్టులు వాటిని ఎంచుకుంటారు. వీడియోల చిత్రీకరణతో పాటు ఫోటోలు, సెల్ఫీలు వంటివి తీసుకుంటారు. వ్లాగ్‌ల పేరుతోనూ రచ్చ చేసే బ్యాచ్‌లు కూడా ఆ డార్క్‌ టూరిజం కిందకొస్తాయ్.

ఇప్పుడు అలాంటి డార్క్‌ టూరిజం వయనాడ్‌కి రావొద్దంటూ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు కేరళ పోలీసులు. సహాయక చర్యలు జరుగుతోన్న సమయంలో డార్క్‌ టూరిస్టులు వస్తే ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా.. ఎవరూ వయనాడ్‌కు రావొద్దని కేరళ పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని.. వందలాది మంది ప్రజల ఆచూకీ కోసం కసరత్తు చేస్తున్నామని.. అందుకే సందర్శకులు రావొద్దని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు డార్క్‌ టూరిస్టులు వస్తే కఠిన చర్యలు తప్పవంటూ గట్టిగానే వార్నింగ్‌ ఇస్తున్నారు.

మొత్తంగా… డార్క్‌ టూరిస్టులపై వెరీ సీరియస్‌గా ఉన్నారు పోలీసులు. డార్క్‌ టూరిజంలాంటి విచిత్ర పోకడపై ఫోకస్‌ పెట్టారు. వీలైతే సాయం చేయండి… పనికట్టుకుని విషాదాన్ని షూట్‌ చేయడానికి రావొద్దంటూ స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇస్తున్నారు. డార్క్‌ టూరిస్టులొస్తే అదో పెద్ద తలనొప్పి అని.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని సోషల్ మీడియా ద్వారా పదేపదే చెబుతున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి