
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ మీడియా పవర్ హౌస్‌గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు భారత ప్రభుత్వం ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.. నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వేవ్స్ (World Audio Visual and Entertainment Summit ) అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ.. పేర్కొన్నారు. గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని మోదీ అన్నారు.
వేవ్స్ సమ్మిట్ 2025 (కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్) తో 100 కి పైగా దేశాల నుంచి కళాకారులు, సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలను ఒకే గొడుగు కిందకు వచ్చారని ప్రధాని మోదీ అన్నారు.. WAVES సమ్మిట్ సృజనాత్మకత కేంద్రంగా అభివర్ణించారు.
కాగా.. ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ లో బాలీవుడ్, టాలీవుడ్ సహా.. భారత సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులు, పలువురు వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.. ఈ సమ్మిట్‌లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ , రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ తారలు పాల్గొన్నారు.
PM @narendramodi addresses #WAVESummit in Mumbai @PMOIndia @WAVESummitIndia @nfdcindia https://t.co/ddkoCwLisM
— Ministry of Information and Broadcasting (@MIB_India) May 1, 2025
కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అన్న ట్యాగ్ లైన్‌తో ఈ వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్‌లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. మూవీలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, AI అన్నింటిని ఒకే వేదికపై అనుసంధానిస్తూ మీడియా-వినోద రంగంలో మన దేశ సత్తాను చాటడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.. సినిమాలు, డిజిటల్ మీడియా, బ్రాడ్ కాస్టింగ్ విభిన్న రంగాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి.. భారతదేశం తొలిసారిగా గ్లోబల్ మీడియా డైలాగ్‌కి ఆతిథ్యం ఇస్తూ.. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..