ఖతర్నాటక.. జలకళ కాదు జలాల చోరకళ! దోపిడీలో ఆరితేరిందా కర్నాటక?

కర్ణాటక చేపడుతున్న ఆల్మట్టి ఎత్తు పెంపు, నవేలి డ్యామ్, మేకెదాటు ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణకు, నవేలి ప్రాజెక్టుతో కృష్ణా, తుంగభద్ర జలాలపై ప్రభావం ఉంటుందని వాదనలు ఉన్నాయి. మరోవైపు మేకెదాటుపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఖతర్నాటక.. జలకళ కాదు జలాల చోరకళ! దోపిడీలో ఆరితేరిందా కర్నాటక?
Karnataka Water Disputes

Updated on: Aug 08, 2026 | 9:55 PM

నదినీళ్లు.. వాటి పంపకాలు. రాజ్యాంగం ప్రకారం ఇది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్. అంతర్రాష్ట్ర జలవివాదాలు పుట్టినప్పుడు, రాష్ట్రాల మధ్య పంచాయితీచేసి రెగ్యులేట్ చేయాల్సివచ్చినప్పుడు మాత్రమే ఢిల్లీ జోక్యం చేసుకుంటుంది. లీగల్ అగ్రిమెంట్లు, ట్రిబ్యునల్స్, రివర్ బేసిన్ బోర్డులు ఇవన్నీ ఆవిధంగా కేంద్రం ఏర్పాటు చేస్తే వచ్చినవే. కోర్టులు చెప్పే తీర్పులు, ఇలా రాసుకున్న ఒప్పందాలు కూడా ఉల్లంఘనకు గురైతే.. రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడ్డానికి ఇంకో మార్గం కూడా ఉంది. 70 ఏళ్లకిందటే ఇంటర్‌ స్టేట్ రివర్ వాటర్ డిస్‌ప్యూట్స్‌ పేరుతో ఒక జాతీయవ్యవస్థే అమల్లో ఉంది. ఇన్ని ఉన్నా, నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య కీచులాటలు మాత్రం తగ్గలేదు. పైగా, పెరుగుతూనే ఉన్నాయి. దేశంగా ఒక్కటై ఉందాం, రాష్ట్రాలుగా మాత్రం కొట్లాడుకుంటూనే ఉంటాం అన్నట్టుంది పరిస్థితి. నీళ్లకోసం జరిగే ఈ తొండాటలో ఆరితేరిన కర్నాటక.. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూనే ఉంటుంది. పక్కరాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు గండికొట్టి, స్వరాష్ట్ర లాభం కోసం పోరాడుతూనే ఉంది. కర్నాటక కొత్త ఎత్తుగడ ఏంటంటే.. ఆల్మట్టి ఎత్తు పెంచడం. ఆల్మట్టి ఎత్తు ఇప్పుడు 519 అడుగులు. 129.72 టీఎంసీల నిల్వ చేసే కెపాసిటీ ఉంది. మరో ఆరడుగులు ఎత్తు పెంచి ఆల్మట్టిని 524 అడుగులకు చేర్చాలన్నది కర్నాటక కొత్త స్కెచ్చు....

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి