Watch Video: టికెట్‌ లేకుండా దర్జాగా ఏసీ కంపార్ట్‌మెంట్‌లో వందల మంది ప్రయాణం.. వీడియో వైరల్‌

|

Dec 11, 2023 | 2:41 PM

రైలులో టికెట్‌ లేకుండా వందల మంది ప్రయాణికులు యదేచ్ఛగా ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను IFS అధికారి ఆకాష్ కె వర్మ Xలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో కొన్ని రైళ్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ఈ వీడియో ఫుటేజీలో సెకండ్‌ క్లాస్‌ AC కంపార్ట్‌మెంట్‌ను చూస్తే ఆశ్చర్యంతో తలమునకవుతారు. ఎందుకంటే జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో మాదిరి నిండా ప్రయాణికులతో కిటకిటలాడిపోవడం వీడియోలో..

Watch Video: టికెట్‌ లేకుండా దర్జాగా ఏసీ కంపార్ట్‌మెంట్‌లో వందల మంది ప్రయాణం.. వీడియో వైరల్‌
Ticketless Passengers
Follow us on

డెహ్రాడూన్, డిసెంబర్‌ 11: రైలులో టికెట్‌ లేకుండా వందల మంది ప్రయాణికులు యదేచ్ఛగా ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను IFS అధికారి ఆకాష్ కె వర్మ Xలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో కొన్ని రైళ్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. ఈ వీడియో ఫుటేజీలో సెకండ్‌ క్లాస్‌ AC కంపార్ట్‌మెంట్‌ను చూస్తే ఆశ్చర్యంతో తలమునకవుతారు. ఎందుకంటే జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో మాదిరి నిండా ప్రయాణికులతో కిటకిటలాడిపోవడం వీడియోలో చూడొచ్చు. సాధారణంగా సెకండ్‌ క్లాస్‌ ఏసీ కంపార్ట్‌మెంట్‌ను ప్రీమియం తరగతిగా పరిగణించబడుతుంది. అయితే వీడియోలో మాత్రం టిక్కెట్లు లేని అనేక మంది ప్రయాణీకులతో కంపార్ట్‌మెంట్‌ మొత్తం నిండిపోయి కనిపిస్తుంది. దీంతో టికెట్‌ కొని ప్రయాణిస్తున్నవారు మాత్రం నానాఅవస్థలు పడాల్సి వస్తోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న రైలు నంబర్ 12369 కలిగిన కుంభ ఎక్స్‌ప్రెస్. టికెట్‌ లేకుండా ఏసీ కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన అనధికార వ్యక్తులు బెర్త్‌లను ఆక్రమించడం, ప్రయాణికులను వేధించడం, ఎమర్జెన్సీ చైన్‌ని లాగడం వంటి దృశ్యాలు వీడియోలో కనిపిస్తుంది. బాధిత ప్రయాణీకులలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించేవారి ఆగడాలకు ఈ వీడియో ఓ ఉదాహరణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

టిక్కెట్ లేని ఆక్రమణదారులు చట్టబద్ధమైన ప్రయాణీకుల ప్రయాణాలకు ఏ విధంగా అసౌకర్యం కలిగిస్తున్నారో వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోపై IFS అధికారి ఆకాష్ కె వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరల్ వీడియోలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్‌ చేస్తూ పరిస్థితిని వివరించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో అధికారులు ఎదుర్కొంటున్న సవాళ్లను వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రైలు ప్రయాణాల్లో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను కామెంట్‌ సెక్షన్‌లో చెప్పుకొచ్చారు.

కాగా ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడం ఇదేం కొత్త కాదు. సౌకర్య వంతంగా ప్రయాణించేందుకు అధిక మొత్తం చెల్లించి కూడా AC కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై రైల్వే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.