న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్‌ను చితగ్గొట్టి.. అతని కారును కొందరు దుండగులు దొంగలించచారు. అనంతరం ఆ కారు డ్రైవర్‌ను ఢీ కొట్టి, 200 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గయపడిన సదరు క్యాబ్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలో మంగళవారం (అక్టోబర్ 10) రాత్రి చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్లున మరో వాహనంలోని వారు ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. అసలేం జరిగిందంటే..
దేశ రాజధాని నూఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఫరీదాబాద్‌కు చెందిన బిజేంద్ర (45) అనే వ్యక్తి క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మహిపాల్‌పూర్ ప్రాంతంలో తన కారులో వెళ్తుండగా కొందరు దుండగులు అతడిపై దాడి చేశారు. అతన్ని కారు నుంచి బయటకు తోసేసి కారుతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో బిజేంద్ర దుండగుల్ని అడ్డుకునేందుకు కారును వెంబడించాడు. దీంతో ఆగ్రహించిన కేటుగాళ్లు కారుతో అతన్ని ఢీ కొట్టారు. అనంతరం కారు డోర్ నుంచి అతన్ని రోడ్డుపై 200 మీటర్లు ఈడ్చుకెళ్లారు. అనంతరం అతన్ని రోడ్డుపై వదిలేసి కారులో పరారయ్యారు.
What’s happening in Delhi? #DisturbingVideo #Delhi pic.twitter.com/eTa2fG3dB0
— Navdeep Singh (@wecares4india) October 11, 2023
ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రద్దీగా వాహనాలు తిరుగుతోన్న రోడ్డుపై దుండగులు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. అదే రోడ్డుపై నిందితుల వాహనం వెనుక ప్రయాణిస్తోన్న మరో వాహనంలోని వారు ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.