తమిళనాడులోని కోయింబత్తూర్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కారులో వచ్చిన దుండగులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. మెడలోని చైన్ గట్టిగా లాడంతో ఆ మహిళ కిందపడిపోయింది. అయినా కూడా దుండగులు వదల్లేదు.. కారుతో కొంత దూరం వరకు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లారు.. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో, మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.
తమిళనాడులోని కోయింబత్తూర్ పీలమేడు వద్ద హడ్కో కాలనీకి చెందిన మహిళ ఆర్.కౌసల్య మార్నింగ్ వాక్ కోసం వెళ్లింది. ఈ క్రమంలోనే కారులో వచ్చిన దుండుగులు.. ఆమె మెడలోని చైన్ లాక్కునే పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌసల్య, ఆమె భర్త రాజ్‌కుమార్ నిత్యం హడ్కో కాలనీ నుంచి సమీపంలోని జివి రెసిడెన్సీకి ఉదయం వాకింగ్‌కు వెళ్తుంటారు. అయితే సోమవారం ఆమె ఒంటరిగానే వాకింగ్‌కు వెళ్లింది. కౌసల్య కాఫీ అవుట్‌లెట్ దగ్గర ఉన్నప్పుడు, ఉదయం 6.30 గంటలకు, వెనుక నుండి తెల్లటి కారు ఆమె వద్దకు వచ్చింది. ముందు ప్యాసింజర్ సీటులో కూర్చున్న ఓ వ్యక్తి అందుబాటులోకి రాగానే ఆమె చైన్ లాక్కున్నాడు. అయితే, కౌసల్య వెంటనే స్పందించి చైన్‌ను గట్టిగా పట్టుకున్నారు. కొన్ని మీటర్ల మేర వాహనంతో పాటు ఈడ్చుకెళ్లినప్పటికీ ఆమె చైన్‌ను విడవకపోవడంతో స్నాచర్ అక్కడ్నుంచి జారుకున్నాడు.
In a shocking incident that unfolded in broad daylight, miscreants in a car snatching woman’s chain while she was on her morning walk in Coimbatore on Monday. #Crime @News9Tweets pic.twitter.com/LqloKia4eN
— RAMKUMAR R (@imjournalistRK) May 16, 2023
సింగనల్లూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఇన్వెస్టిగేషన్ వింగ్) ఎం. మీనాంబిగై మాట్లాడుతూ.. మహిళ ప్రతిఘటించడంతో ఆమె గొలుసు పోలేదని చెప్పారు. కిందపడటంతో ఆమెకు గాయాలైనట్టుగా చెప్పారు. కారుకు నంబర్ ప్లేట్లు లేవు. నిఘా కెమెరా విజువల్ ప్రకారం పక్కన పసుపు రంగు రిఫ్లెక్టర్ స్టిక్కర్ ఉండటంతో అది టాక్సీ క్యాబ్‌గా కనిపిస్తోంది. నేరస్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..