Kerala Man: రోడ్డుపై అపరిచితుడు సీన్.. ట్రక్కుపై తెగిపడిన కరెంట్‌ తీగలు.. పెను ప్రమాదాన్ని తప్పించిన వ్యక్తి

|

Feb 02, 2022 | 5:00 PM

Viral Video: కేరళ(Kerala)లో జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. కోజికోడ్ జిల్లా(Kozhikode district)లో ఓ ట్రక్ డ్రైవర్ ట్రక్కునిండా స్ట్రా బండిల్స్ వేసుకొని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎందుకో సడెన్ గా..

Kerala Man: రోడ్డుపై అపరిచితుడు సీన్.. ట్రక్కుపై తెగిపడిన కరెంట్‌ తీగలు.. పెను ప్రమాదాన్ని తప్పించిన వ్యక్తి
Kerala Man Drives Burning T
Follow us on

Viral Video: కేరళ(Kerala)లో జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. కోజికోడ్ జిల్లా(Kozhikode district)లో ఓ ట్రక్ డ్రైవర్ ట్రక్కునిండా స్ట్రా బండిల్స్ వేసుకొని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎందుకో సడెన్ గా సైడ్ మిర్రర్ లోకి చూశాడు. తాను నడుపుతున్న ట్రక్ నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఖంగుతిన్న అతను.. ఓర్నాయనో కాసేపుంటే చచ్చేవాడ్ని అనుకుంటూ ట్రక్కును రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. వాయనాడ్ నుంచి బయలుదేరిన ఈ ట్రక్… కోడంచెర్రి( Kodenchery town) దగ్గర రోడ్డుపైన నిలిచిపోయింది. గాలి బాగా వీస్తుండటంతో ట్రక్కు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న షాజీ వర్గీస్ అనే వ్యక్తి ఆ మంటలు చుట్టుపక్కల ఇళ్లు, షాపులకు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే ఆ వాహనంఎక్కి డ్రైవర్ సీటులో కూర్చొని… ఆ ట్రక్కును అక్కడికి దగ్గరలో ఉన్న ఖాళీ గ్రౌండ్‌లోకి తీసుకెళ్లాడు. బండిని గ్రౌండ్ లోకి తీసుకెళ్తూ… అక్కడ జిగ్ జాగ్ లాగా నడుపుతూ… స్ట్రా బండిల్స్ కింద పడేలా చేశాడు. వాటిలో కొన్నింటికి ఇంకా మంటలు అంటుకోలేదు. స్థానికులు వచ్చి వాటిని పక్కకు తీశారు. అలా పెను ప్రమాదం జరగకుండా ఆపిన వర్గీస్ ని స్థానికులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఇంతలో ఫైర్ టీమ్ వచ్చి… మంటల్ని ఆర్పివేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ యూజర్‌ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఒక్కరోజులోనే దీన్ని లక్షల మంది వీక్షించారు.

వర్గీస్ ఓ వ్యాపారి. అతనికి డ్రైవింగ్‌ కూడా తెలియడంతో నాకెందుకులే అని అనుకోకుండా అతను తమ ప్రాణాలకు తెగించి… చుట్టుపక్కల అగ్ని ప్రమాదం జరగకుండా కాపాడాడు. అందుకే అతన్ని హీరో అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అపరిచితుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లో… రోడ్డుపైన వర్షపు నీటిలో కరెంట్‌ తీగ పడిన సీన్ ఉంటుంది. అదే విధంగా… ఈ స్ట్రాల ట్రక్ రోడ్డుపై వస్తున్నప్పుడు ఓ చోట కరెంటు తీగ ట్రక్ పై పడింది. అది షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగినట్లు తెలిసింది.

Also Read:

 ఇంట్లోకి దూసుకొచ్చిన కారు.. అందులో ఏముందో చెక్ చేసి కంగుతిన్న పోలీసులు

తెలంగాణ పట్ల కేంద్ర విపక్ష చూపుతోంది.. కొత్త బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదుః కేటీఆర్