AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: గుండె జారిపోయే సీన్.. రోడ్డుపై వెళ్తూ.. బైక్‌తో సహా డ్రైనేజీలో పడిపోయిన దంపతులు!

గుజరాత్‌లోని జునాగఢ్ నగరంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఒక భయానక ప్రమాదం సంభవించింది. నగరంలోని బిజీగా ఉండే ఆజాద్ చౌక్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ఒక దంపతులు ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ గుంతలో పడిపోయారు. ఉదయం వేళ అందరూ చూస్తుండగానే జరిగిన ఈ షాకింగ్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: గుండె జారిపోయే సీన్.. రోడ్డుపై వెళ్తూ.. బైక్‌తో సహా డ్రైనేజీలో పడిపోయిన దంపతులు!
Couple Falls Into Pothole
Balaraju Goud
|

Updated on: Jul 03, 2026 | 1:44 PM

Share

గుజరాత్‌లోని జునాగఢ్ నగరంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఒక భయానక ప్రమాదం సంభవించింది. నగరంలోని బిజీగా ఉండే ఆజాద్ చౌక్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న ఒక దంపతులు ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ గుంతలో పడిపోయారు. ఉదయం వేళ అందరూ చూస్తుండగానే జరిగిన ఈ షాకింగ్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాధితులు తమ బైక్‌పై రోడ్డు దాటుతుండగా, అక్కడ డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతను గమనించలేకపోయారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో బైక్ నేరుగా ఆ లోతైన గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించి, గుంతలోంచి దంపతులను బయటకు తీశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరో ఘటనలో, ఓఘడ్‌నగర్ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు ఒకే గుంతలో పడిపోయారు. ఈ ఘటనలు నగర రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియజేస్తోంది.

నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, అధికారులు కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తవ్విన గుంతలను సరిగా మూసివేయకపోవడం, రాత్రి లేదా ఉదయం వేళల్లో వాహనదారులకు కనిపించేలా బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే తరచూ ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us