రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 2023లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లకు నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే. మార్చి లో జరగనున్న పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ప్రముఖుల కోసం స్పెషల్ గిఫ్ట్స్ సిద్ధం చేస్తోంది. అంబానీ స్వస్థలం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి 3 వరకు పెళ్లి జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక్కి ప్రముఖులు వివాహానికి హాజరుకానున్నారు. పెళ్ళికి వచ్చే అతిధులకు అంబానీ కుటుంబం ప్రత్యేక బహుమతులను అందజేసి సత్కరించనుంది.
2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని అంబానీ కుటుంబం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహాబలేశ్వర్‌కు చెందిన దృష్టి లోపం ఉన్న కళాకారులు రూపొందించిన ప్రత్యేక కొవ్వొత్తులను ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యే ప్రముఖులకు బహుమతిగా అందిస్తున్నారు. ట్విట్టర్ ఖాతా @Swadesh_Online ఈ విషయాన్నీ తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది.
Lighting the way for love ~ The upcoming wedding of Anant Ambani and Radhika Merchant is proving instrumental in celebrating traditional Indian art forms. #IndianCraftforAR #SwadeshOnline pic.twitter.com/BGGhoT2iTl
— Swadesh (@Swadesh_Online) February 14, 2024
పెళ్లి జరుగుతున్న శుభ సందర్భాన్ని పురష్కరించుకుని అంబానీ కుటుంబం ‘స్వదేశ వస్తువుల’ను.. కళాకారుల ప్రతిభను కీర్తిస్తుంది. అంతేకాదు ప్రాచీన హస్తకళల అమూల్యమైన వారసత్వాన్ని కాపాడడంలో మేము సైతం అంటోంది.
ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీ వివాహం అప్పట్లో దేశంలో ఎవరూ చూడని విధంగా అత్యంత ఖరీదైన వివాహంగా పేరుపొందింది. అంబానీ ఫ్యామిలీ తమ ముద్దుల కుమార్తె పెళ్లికి రూ.700 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు ముఖేష్ చిన్న తనయుడు అనంత్ అంబానీ.. రాధికల పెళ్లి ఇంతకంటే గ్రాండ్ గా జరగనుందనే వార్త సర్వత్రా హల్‌చల్ చేస్తోంది. ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ వివాహానికి అంబానీ కుటుంబం 1200 మందికి పైగా అతిథులను ఆహ్వానించింది. ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్‌లో బాలీవుడ్ స్టార్స్‌తో సహా ప్రముఖ గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..