Pune: హైవేపై తగలబడిన వోల్వో బస్సు..ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు!

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై వోల్వో బస్సు తగలబడింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాద సమయంలో బస్సుల్లో 20-25 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Pune: హైవేపై తగలబడిన వోల్వో బస్సు..ప్రాణ భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు!
Pune Bus Fire

Updated on: Apr 17, 2025 | 5:06 PM

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఖేడ్ శివపూర్ సమీపంలో పూణె-బెంగళూరు హైవే పై రన్నింగ్‌ బస్సులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు పక్క నుంచి దూరంగా పరుగులు పెట్టారు. బస్సు డ్రైవర్‌ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 20-25 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ కొందరి ప్రయాణికుల లగేజ్‌ మాత్రం బస్సుతో సహా కాలిపోయినట్టు తెలుస్తోంది.

రోడ్డుపై బస్సు తగలబడిపోవడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు బస్సును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు. అయితే బస్సు తగలబడుతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్‌లలో వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….