Pm Modi: ప్రధాని మోడీ చెంతకు లావేరు కళాకారుడి ప్రతిభ.. మోడీ చిత్రంతో చేనేత వస్త్రం

|

Aug 08, 2024 | 8:42 AM

చేనేత అనేది ఒక వృత్తి కాదు. ఇది కళాత్మకంగా, నైపుణ్యంతో చేయాల్సిన పని. చేతులతోనే అందంగా కళాత్మకంగా చేసే పని మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో చేనేత వస్త్రాలు తయారు అవుతాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలున్నాయని ఇటీవల యునెస్కో వెల్లడించింది. స్వదేశీ ఉద్యమం పేరుతో జాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7 వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ చేనేత కళాకారుడు ప్రతిభ దేశ ప్రధాని మోడీ దృష్టికి చేరుకుంది.

Pm Modi: ప్రధాని మోడీ చెంతకు లావేరు కళాకారుడి ప్రతిభ.. మోడీ చిత్రంతో చేనేత వస్త్రం
Laveru Handloom Fabric
Follow us on

మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా చేనేత కార్మికుల జీవితం ఒడిదుడుకులకు లోనవుతూ వస్తుంది. వాస్తవానికి మన దేశ చేనేత వస్త్రాలు బ్రిటిష్ పాలకులు మన దేశంలో అడుగు పెట్టనంత వరకూ ఓ రేంజ్ లో సాగింది. అగ్గిపెట్టెలో పట్టేటంత భారీ వస్త్రాలను నేచే నైపుణ్యం మన చేనేత కళాకారుల సొంతం. కాలక్రమంలో మిల్లు వస్త్రాలు అడుగు పెట్టి చేనేత వస్త్రాల వైభవం మసకబారింది. అయితే మళ్ళీ ప్రజల ఆలోచనల్లో జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. చేనేత వస్త్రాలకు తిరిగి వైభవం తీసుకుని వచ్చే విధంగా రోజులు వస్తున్నాయి. వాస్తావానికి చేనేత అనేది ఒక వృత్తి కాదు. ఇది కళాత్మకంగా, నైపుణ్యంతో చేయాల్సిన పని. చేతులతోనే అందంగా కళాత్మకంగా చేసే పని మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో చేనేత వస్త్రాలు తయారు అవుతాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలున్నాయని ఇటీవల యునెస్కో వెల్లడించింది. స్వదేశీ ఉద్యమం పేరుతో జాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7 వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ చేనేత కళాకారుడు ప్రతిభ దేశ ప్రధాని మోడీ దృష్టికి చేరుకుంది.

విజయనగరం జిల్లా ఎచ్చెర్ల మండలం లావేరుకు చెందిన చేనేత కళాకారులు మగ్గంపై ప్రధాని మోడీ చిత్రం నేశారు. లావేరుకు చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు 40 రోజుల పాటు శ్రమించి 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవున్న వస్త్రంపై ప్రధాని మోడీ చిత్రాన్ని దారాలతో అందంగా ఆవిష్కరించారు. ఈ చిత్రం ఎంపి అప్పలనాయుడు చేతికి చేరింది. దీంతో వస్త్రంపై ఉన్న మోడీ చిత్రాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రధాని మోడీకి బహుమతిగా అందించారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు డిల్లీలో ప్రధానిని కలిశారు. మూడో సారి దేశ ప్రధానిగా భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీని అబినందిస్తూ ఈ అరుదైన కళాఖండాన్ని అందిచినట్లు ఎంపీ అప్పలనాయుడు చెప్పారు. అందమైన జ్ఞాపికను అందుకున్న ప్రధాని మోడీ చేనేత కళాకారులైన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను అభినందించారని చెప్పారు.

అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు శతజయంతి సందర్భంగా పీవీజీ రాజు జీవితచరిత్ర పుస్తకాన్ని ప్రధాని మోడీకి అందజేశారు. ఈ పుస్తకం అందుకున్న ప్రధాని మోడీ స్పందిస్తూ అశోక్‌రాజు ఎలా ఉన్నారు.. ఆరోగ్యం బాగుందా అని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..