AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Flight Crash: విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు ఎలా తప్పించుకున్నాడు..?

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్క మృత్యుంజయుడు. ఇది నిజంగా మిరాకిల్‌. ఈ ప్రమాదంలో ప్రయాణికులు బతికేందుకు...0.001 శాతం మాత్రమే చాన్స్. అంటే దాదాపు అసాధ్యం. కానీ అసాధ్యాన్ని సుసాద్యం చేస్తూ...అతడెలా బతికాడు. ఎమర్జెన్సీ ఎగ్జిటే అతన్ని కాపాడిందా..? అంతటి భారీ విస్పోటం జరిగినా...ఎలా బయటపడగలిగాడు...? 11-A సీటే అతడ్ని కాపాడిందా...? విమానం ఎగరడానికి కూలడానికి 2నిమిషాలే. తనను తాను కాపాడుకునేందుకు మిగిలింది 30సెకన్లే. మరి ఆ 30సెకన్లలో అతనేం చేశాడు..?

Air India Flight Crash: విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు ఎలా తప్పించుకున్నాడు..?
Viswashkumar Ramesh
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2025 | 12:56 PM

Share

ఘోర విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకైక సర్వైవర్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ (39) గా గుర్తించారు.. వడవడిగా అడుగులేస్తూ తనకు తానే వచ్చి  ఆంబులెన్స్ ఎక్కాడు మృత్యుంజయుడు. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తోన్న మొత్తం 242మందిలో 241మంది చనిపోయారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన స్థితిలో మృతదేహాలున్నాయి. విమానం కూలిన విధానం…కూలగానే భారీ విస్పోటనం…కూలిన భారీ బిల్డింగ్..అలుముకున్న దట్టమైన పొగ…ఈ సిట్చువేషన్స్‌ చూసి ఎవరూ బతికి బట్టకట్టలేరని అందరూ భావించారు. గాయాలతో హాస్పిటల్‌లో చేరినవారంతా మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్ధులు, సిబ్బంది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో విశ్వాస్ చిన్న చిన్న గాయాలతో బయటపడటం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న విశ్వాస్‌.. ఎకానమీ క్లాస్‌లో 11Aసీటులో కూర్చున్నాడు. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో సీటింగ్ లేఅవుట్ చూస్తే..11Aసీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ విండో కాదు. ఎగ్జిట్ విండోకు కాస్త దూరంగా ఉంటుంది. మామూలుగా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లో ఎకానమీ క్లాస్‌లో 2-3-2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ లేఅవుట్‌లో ఒక్కో వరుసలో రెండు విండో సీట్లు..అంటే ఎడమవైపు A, B; కుడివైపు J, K, మధ్యలో మూడు సీట్లు D, E, F ఉంటాయి. ఇప్పుడు విశ్వాస్ కూర్చున్న 11A సీటు ఎడమవైపు విండో సీటు, రెండు సీట్ల గ్రూప్‌లో బయటి వైపున ఉంటుంది. ఈ సీటు విమానం ముందు భాగంలో, రెక్కలకు కొంత ముందు ఉంటుంది. 11A సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు కాదు, ఎందుకంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లు రెక్కల దగ్గర ఉంటాయి. అంటే 19వ వరుస వద్ద ఉంటాయి. విమానంలో ఓవర్‌వింగ్ ఎగ్జిట్‌లు 19A, 19K సీట్ల వద్ద ఉన్నాయి. ఈ ఎగ్జిట్‌లు విమానం ఎడమ, కుడి వైపులా ఉంటాయి, ప్రతి ఎగ్జిట్ వద్ద ఒక విండో ఉంటుంది. 11A సీటు నుంచి 19A సీటు వద్ద ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు దూరం సుమారు 8 వరుసలు, అంటే దాదాపు 6-8 మీటర్లు. 11A సీటు విమానం ముందు భాగంలో ఉండటం వల్ల, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. విశ్వాస్ ఎమర్జెన్సీ గేట్‌ను తెరిచుకుని బయటకు వచ్చాడని కొందరు చెబుతున్నారు. కానీ ఇది సాధ్యమా..అన్నది కొందరి ప్రశ్న. ఎందుకంటే విమానం కూలిన విధానం…బయటకు దూకే అవకాశం కూడా లేని విధంగా ఉంది.అందుకే రమేష్ ఎలా తప్పించుకున్నాడన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు రెక్కల దగ్గర ఉండటం వల్ల, విమానం కూలిన తర్వాత రమేష్ వెంటనే క్యాబిన్ లేఅవుట్ గురించి అవగాహన ఉండి..త్వరగా బయటపడి ఉండొచ్చు.

ప్రమాదం బయటపడి లేచేసరి అతని చుట్టుపక్కల కొన్ని మృతదేహాలు పడి ఉన్నాయని విశ్వాస్ చెబుతున్నాడు. దాంతో భయపడి పరుగులు పెట్టినట్లు తెలిపాడు. ప్రస్తుతం విశ్వాస్..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుజరాత్‌లో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు బ్రిటన్‌ నుంచి విశ్వాస్‌ రాగా.. రిటన్ జర్నీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశ్వాస్‌ సోదరుడు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

‘‘అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయాననుకున్నా. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్‌ భవనం శిథిలాల్లో ఉన్నా. నేను మెల్లగా నా సీటు బెల్టు తీసి అక్కడి నుంచి బయటకు వచ్చా.  మంటల ధాటికి నా ఎడమచేయికి గాయమైంది.  ఆ సమయంలో ఎవరో నన్ను పట్టుకొని అంబులెన్సులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు’’ అని రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..