Vadodara Man: దృష్టిలోపం.. అతని పట్టుదల ముందు తలవంచిన ఫ్రెండ్‌షిప్‌ పర్వతం.. నెక్స్ట్ టార్గెట్ ఎవరెస్టు అట

|

Nov 26, 2021 | 7:25 PM

Vadodara Man: అతనికి దృష్టి లోపం ఉంది.. అయితే అతని పట్టుదల ముందు పర్వతం ఎత్తు చిన్నబోయింది. స్నేహితుడి సాయంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు.. సముద్ర మట్టానికి..

Vadodara Man: దృష్టిలోపం.. అతని పట్టుదల ముందు తలవంచిన ఫ్రెండ్‌షిప్‌ పర్వతం.. నెక్స్ట్ టార్గెట్ ఎవరెస్టు అట
Vadodara Man
Follow us on

Vadodara Man: అతనికి దృష్టి లోపం ఉంది.. అయితే అతని పట్టుదల ముందు పర్వతం ఎత్తు చిన్నబోయింది. స్నేహితుడి సాయంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు.. సముద్ర మట్టానికి 17,346 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఫ్రెండ్‌షిప్‌ను అధిరోహించారు.  అయితే తాను ఇప్పటికే పావగఢ్, జంబుఘోడ , ఛోటా ఉదేపూర్‌లో పర్వతాలను అధిరోహించానని.. ఇప్పుడు హిమాలయాల పర్వత శ్రేణులకు భిన్నమైన  పర్వతాలను తన స్నేహితుడి సాయం తో అధిరోహించగలిగినట్లు చెప్పారు గుజరాత్ కు చెందిన 43 ఏళ్ల సంజీవ్ గోఖ్లే. వివరాల్లోకి వెళ్తే..

తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సంజీవ్ కు పర్వతారోహణ, ప్రకృతిపై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో సంజీవ్ అతని స్నేహితుడు పుష్పక్‌తో కలిసి హిమాలయాల్లోని స్నేహ శిఖరం అనే శిఖరాన్ని అధిరోహించారు.  ఈ యాత్ర ఐదురోజుల పాటు సాగింది. ఈ కఠినమైన యాత్రను తాను చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు చెప్పారు సంజయ్. అంతేకాదు తాను గుజరాత్‌లో 4-5 గంటలు ట్రెక్కింగ్ చేసేవాడినని.. అయితే హిమాలయాల్లో 8 గంటలు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది” అని గోఖ్లే చెప్పారు.

అంతేకాదు తాను పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు .. ఎత్తుపైకి వెళ్తున్న సమయంలో నా ముందు ఉన్న వ్యక్తి బ్యాగ్ కు ఉన్న తీగని పట్టుకుంటానని చెప్పారు.  అదే పర్వతం నుంచి కిందకు దిగే సమయంలో అయితే నా ముందున్న వ్యక్తి భుజం మీద చేయి వేసుకుంటానని చెప్పారు.

2001లో గోఖ్లేకి రెటినిటిస్ పిగ్మెంటోసా అనే ప్రోగ్రెసివ్ విజన్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. “క్రమక్రమంగా దృష్టిని కోల్పోతున్న సమయంలో ప్రకృతిలోని అందాలను చూసినట్లు చెప్పారు. తాను దృష్టి కోల్పోయే ముందు మొసళ్ళు, సరీసృపాలు, పాములు , క్షీరదాలకు చెందిన రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు చెప్పారు. అంతేకాదు అటవీ శాఖ నిర్వహించే వివిధ జనాభా గణనల్లో తాను భాగమయ్యానని అన్నారు. నేను ఇప్పుడు చూడలేను.. అయితే నా అభిరుచి మాత్రం మారలేదు.. నేను ఎప్పుడు చూపుకోల్పోడాన్ని ఒక వైకల్యంగా భావించలేదని చెప్పారు. ప్రకృతిని ఆస్వాదించడం, పర్వతాలను అధిరోచినదం నాకు ఇష్టం.. ఇది నా స్నేహితుల వల్ల అది నిజమవుంటుందని చెప్పారు. తాను ఎప్పటికైనా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది తన కల అని గోహిల్ తెలిపారు.

Also Read:  అంతరిక్షంలో పెట్రోలు బంకులు.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాసా.. స్పేస్‌ సంస్థ ప్రయోగాలు