ముంబై, నవంబర్ 17: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లి 50వ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాకు చెందిన ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. కోహ్లీ చేసిన పరుగులకు సమానమైన డిస్కౌంట్ ఇస్తున్నట్లు రెస్టారెంట్ యాజమన్యం ప్రకటించింది. అసలే అది బిర్యానీ రెస్టారెంట్.. పైగా డిస్కౌంట్ ప్రకటించడంలో జనం ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో సదరు రెస్టారెంట్ వద్ద తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. క్రికెటర్ చేసిన పరుగులకు సమానమైన బిర్యానీపై తినుబండారాల యాజమాన్యం డిస్కౌంట్ ప్రకటించింది. కోహ్లి రికార్డు బ్రేక్ చేస్తూ 50వ సెంచరీని సాధించడంతో.. తగ్గింపు 100%కి చేరుకుంది. దీంతో చికెన్, మటన్ బిర్యానీ కస్టమర్లకు ఉచితంగా లభించింది.
ఫ్రీగా భోజన ప్రియులు ఎగబడి మరీ నచ్చిన బిర్యానీని లాగించేశారు. దీంతో ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం దేహత్ పోలీసు పరిధిలోని టికోని బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రెస్టారెంట్ ఆఫర్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లు రెస్టారెంట్‌కు పోటెత్తారు. కస్టమర్లు లైన్‌లో బారులు తీరి నిలబడ్డారు. బిర్యానీ ప్లేట్‌లను పోటీపడీ మరీ లాగించేశారు. దీంతో రెస్టారెంట్ వద్ద స్వల్ప గందరగోళం ఏర్పడింది. ఊహించని డిమాండ్ రావడంతో రెస్టారెంట్‌లో బిర్యానీ కొద్ది నిమిషాల్లోనే ఖాళీ అయ్యింది. బిర్యానీ అయిపోయినట్లు రెస్టారెంట్ యాజమన్యం వెల్లడంచడంతో అప్పటి వరకూ క్యూలలో వేచిఉన్న కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసాన్ని నివారించడానికి రెస్టారెంట్ యాజమన్యం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అక్కడికి చేరుకుని రెస్టారెంట్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడిన కస్టమర్లను చెదరగొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి సర్దుమనిగింది.
Virat Kohli’s love,
Yesterday, a restaurant named Lucknowi Rasoi in Bahraich had announced that the number of runs that Virat Kohli scores in the semi-finals will be given that much % discount on the biryani. Then did Kohli hit a hundred today#ViratKohli𓃵#IndiaVsNewZealand pic.twitter.com/WbNDIs8hXC
— Sarfraz Alam (@eralamwriter) November 15, 2023
కాగా గత బుధవారం విరాట్ కోహ్లీ తన 50వ వన్డే అంతర్జాతీయ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును కోహ్లీ అధిగమించినట్లైంది. 279వ ఇన్నింగ్స్‌లో 50వ సెంటరీ మైలురాయిని ఛేదించాడు. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కోహ్లీ నా రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందంటూ సచిన్ టెండుల్కర్ ఎక్స్‌లో పోస్టు చేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.