పణజీ, డిసెంబర్ 29: కదులుతున్న కారుపై ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు కారుపై నిద్రిస్తున్నారని కారు డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు వారించినా బేఖాతరు చేయకపోవడం గమనార్హం. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తి బాధ్యతారహిత్యంపై మండిపడుతున్నారు. డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన గోవాలో చోటు చేసుకుంది. గోవాలోని మాపుసా పట్టణ సమీపంలో కదులుతున్న ఓ కారుపై ఇద్దరు చిన్నారులు ప్రమాదకర రీతిలో నిద్రిస్తూ కనిపించారు. పర్రా గ్రామంలో బుధవారం ఓ టూరిస్టు వాహనంలో వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
కదులుతున్న XUV కారుపై భాగంలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తూ కనిపించారు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కారుపై చిన్నారులు పడుకొని ఉండటంపై.. వీడియో తీస్తున్న వ్యక్తి డ్రైవర్‌ను ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పకుండా డ్రైవింగ్‌ను కొనసాగిస్తూ ముందుకు వెళ్లిపోయాడు. వెళ్లిపోవడం గమనార్హం. ఈ వీడియో డిసెంబర్ 27న పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో సదరు టూరిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం విచారకరం. రిలాక్స్ అవడానికి గోవాకి వచ్చారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా.. ఇది పిల్లలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. సాధారణంగా అనిపించినా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలంటూ ఓ యూజర్ కామెంట్ సెక్షన్‌లో చెప్పుకొచ్చాడు.
#Goa #viralvideo : Children Spotted Sleeping on Roof of Moving SUV Raises Concerns for Child Safety https://t.co/sRXrNavBRo pic.twitter.com/7djb5DIxB8
— Pune Pulse (@pulse_pune) December 28, 2023
ఈ వీడియోపై పోలీసులు సుమోటోగా చర్య తీసుకోవాలని మరొక యూజర్ డిమండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు గోవా పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి మాపుసా పోలీసులు కారు నిడిపన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.