కుంభమేళా ఎఫెక్ట్‌.. ఫస్ట్‌ క్లాస్‌ భక్తులకు ఊహించని ట్విస్ట్‌! వైరల్‌ వీడియో

మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటూ త్రివేణి సంగమంలో పుణ్యాస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. ఇంకా భక్తులు వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారు. రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో, విమానల్లో ఏదో విధంగా మహా కుంభమేళాకు వెళ్లి, పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని అనుకుంటున్నారు.

కుంభమేళా ఎఫెక్ట్‌.. ఫస్ట్‌ క్లాస్‌ భక్తులకు ఊహించని ట్విస్ట్‌! వైరల్‌ వీడియో
Maha Kumbha Mela 2025

Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 13, 2025 | 6:28 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇప్పటికే దాదాపు 42 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పాల్గొని, త్రివేణి సంగమంలో పుణ్యాస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. ఇంకా భక్తులు వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారు. రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో, విమానాల్లో ఏదో విధంగా మహా కుంభమేళాకు వెళ్లి, పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్లే మార్గాలన్ని రద్దీగా మారాయి. వందల కిలో మీటర్ల దూరం వరకు విపరీతమైన ట్రాఫిక్‌ ఉంది. ఇక రైళ్లలో వెళ్లే వారి సంఖ్య తక్కువేం లేదు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లన్ని నిండిపోతున్నాయి.

బిహార్‌ గుండా వెళ్లే రైళ్లలో అక్కడి వారి ఎక్కేందుకు కూడా చోటు ఉండటం లేదు. అప్పటికే ఫుల్‌గా నిండి వస్తున్న రైళ్లలోకి ఎక్కలేక చాలా మంది ప్రజలు స్టేషన్లలోనే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని సార్లు రైళ్లపై రాళ్లదాడి కూడా జరిపారు. ఆల్రెడీ బోగీ నిండా జనం ఉండటం, ఇంకా అందులోకి జనం ఎక్కే పరిస్థితి లేకపోవడంతో లోపల ఉన్నవారు డోర్లు లోపలి నుంచి లాక్‌ చేసుకోవడంతో స్టేషన్‌ లో ఉన్న వాళ్లు రైళ్లపై రాళ్లతో దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి కేవలం జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో అనుకుంటే పొరపాటే. స్లీపర్‌తో పాటు ఏసీ ఫస్ట్‌ క్లాస్‌లో కూడా జనం విత్‌ అవుట్‌ రిజర్వేషన్‌ ఎక్కేస్తున్నారు. చాలా మంది కనీసం టిక్కెట్‌ కూడా కొనకుండా ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ రైళ్లలో ప్రయాణిస్తుండటం విశేషం.

తాజాగా ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అతను కుంభమేళాలో పాల్గొనేందుకు చాలా ఖర్చు పెట్టి ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ బెర్త్‌ బుక్‌ చేసుకున్నాడు. అతను ఎక్కే ముందు బెర్త్‌ చాలా విశాలంగా, సుఖంగా పడుకొని ప్రయాణించేందుకు అనువుగా ఉంది. కానీ, ఒక్కసారి డోర్‌ తీసి.. బయట గ్యాలరీలో చూస్తే జనం కిక్కిరిపోయి ఉన్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒరెయ్‌ అది ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ అనుకుంటున్నారా? లేక జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ అనుకుంటున్నారా? అంటూ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఆ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్‌ రావడం గమనార్హం. కుంభమేళాకు ఏ రేంజ్‌లో భక్తులు వెళ్తున్నారో చెప్పేందుకు ఈ ఒక్క వీడియో మంచి ఉదాహరణ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…