Baga Beach in Goa: ఓ వైపు దేశ వ్యాప్తంగా మళ్ళీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు… మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుదల.. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ దేశంలోనే ప్రముఖ పర్యాటక రాష్ట్రం గోవాలో గుంపు గుంపులుగా జనం కనిపిస్తున్నారు. తాజాగా ఓ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్ వినియోగదారుడు . @Herman_Gomes హ్యాండిల్ గోవా కు చెందిన ఓ వీడియో షేర్ చేస్తూ.. ఇది ” కోవిడ్ వేవ్‌కు రాయల్ వెల్‌కమ్.. భారీగా పర్యాటకులు అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు. ఉత్తర గోవాలోని బాగా బీచ్ సమీపంలోని రోడ్డుపై వందలాది మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు.. కరోనా వ్యాప్తికి కొంతమంది ప్రజలు తమ వంతు కృషి చేస్తున్నారంటూ.. వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్ సీజన్ కోసం గోవా వెళ్లిన పర్యాటకులతో సందడి నెలకొంది. పర్యటకులు భారీగా గోవాకు చేరుకోవడంతో మళ్ళీ గోవాలో కరోనా కేసుల పాజిటివ్ రేటు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. COVID-19 పాజిటివిటీ 10 శాతం దాటిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోవా లో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, వేలాది మంది దేశీయ పర్యాటకులు గోవాలోని బీచ్‌ల్లో, పబ్‌ల్లో, నైట్‌క్లబ్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి చేరుకున్నారు. అయితే గోవాలో పర్యటించాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్, లేదా ఆర్టీపిసిఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాల్సినే అన్న నిబంధన అమలులో ఉంది. ఇవి ఉన్న పర్యాటకులను మాత్రమే అనుమతించాలని గోవాలోని హోటళ్లు, రెస్టారెంట్లు , కాసినోలకు అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
This was Baga Beach in Goa ,last night. Please take the Covid scenario seriously. This is a Royal welcome to the Covid wave ? Mostly tourists. pic.twitter.com/mcAdgpqFUO
— HermanGomes_journo (@Herman_Gomes) January 2, 2022
Also Read: 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న వైస్ అడ్మిరల్ SH శర్మ మృతి… రేపు అంత్యక్రియలు