ద్వారక, ఏప్రిల్ 14: దేశ రాజధాని ఢిల్లీలో రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు దగ్ధమైన ఘటన కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 9లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆవరణలో బస్సులు నిలిపి ఉంచిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో బస్సులన్నింటినీ స్కూల్ ఆవరణలో పార్క్ చేశారు. అయితే పార్కు చేసి ఉన్న బస్సుల్లో రెండింటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకురి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. బస్సులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్న వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
In Delhi’s Dwarka Sector 9, a fire suddenly broke out in two school buses parked at R.D. Rajpal Public School. Around 2:30, the fire department was informed about the fire. 4 to 5 fire tenders have been dispatched to the scene to extinguish the fire. pic.twitter.com/AK3Dmuust2
— Atulkrishan (@iAtulKrishan1) April 14, 2024
ఆర్‌డి రాజ్‌పాల్ పబ్లిక్ స్కూల్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బస్సులు పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన బస్సుల్లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించామని, దాదాపు నాలుగు నుంచి ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు సమాచారం. అగ్నిప్రమాదం వెనుక గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. కాగా ఏప్రిల్ 2న కూడా ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఊపిరాడక 14 ఏళ్ల బాలిక, ఆమె 12 ఏళ్ల చెల్లెలు మరణించారు. మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.