President Droupadi: సిక్కింలో సీఎం భార్యతో కలిసి నృత్యం చేసిన ద్రౌపది.. సంస్కృతిలోని వైవిధ్యం, అందం, ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న రాష్ట్రపతి

|

Nov 05, 2022 | 11:46 AM

ముర్ము గ్యాంగ్‌టక్ చేరుకున్న సమయంలో సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, తూర్పు హిమాలయ ప్రాంతంలో ఉన్న సిక్కిం భారతదేశంలోని అత్యంత సుందరమైన రాష్ట్రాల్లో ఒకటని పేర్కొన్నారు

President Droupadi: సిక్కింలో సీఎం భార్యతో కలిసి నృత్యం చేసిన ద్రౌపది.. సంస్కృతిలోని వైవిధ్యం, అందం, ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న రాష్ట్రపతి
President Droupadi Murmu Danace
Follow us on

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణా రాయ్‌తో కలిసి ఒక వేదికపై డ్యాన్స్ చేశారు. సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఒక వేదికపై స్థానిక బృందంతో కలిసి ‘సమైక్య నృత్యం’ ప్రదర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల సిక్కిం పర్యటన సందర్భంగా ముర్ము ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో.. ఒక బృందం వేదికపై ప్రదర్శన ఇస్తోంది. ఈ బృందంతో కలిసి  ద్రౌపది ముర్ము, కృష్ణ రాయ్‌ డ్యాన్స్ చేశారు. ఈ నృత్యం సిక్కిం సంస్కృతిలోని వైవిధ్యం, అందం, ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

సిక్కిం ప్రభుత్వం తన గౌరవార్థం ఏర్పాటు చేసిన పౌర సత్కారానికి ముర్ము హాజరయ్యారు. గాంగ్‌టక్‌లో విద్య, ఆరోగ్యం, రహదారి మౌలిక సదుపాయాలు,  పర్యాటక రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

 

ముందుగా ముర్ము గ్యాంగ్‌టక్ చేరుకున్న సమయంలో సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, తూర్పు హిమాలయ ప్రాంతంలో ఉన్న సిక్కిం భారతదేశంలోని అత్యంత సుందరమైన రాష్ట్రాల్లో ఒకటని, ఇది మంచుతో నిండిన శిఖరాలు, దట్టమైన అడవులు, అరుదైన వృక్ష, జంతుజాలం, అందమైన సరస్సులతో కనువిందు చేస్తుందని పేర్కొన్నారు. సిక్కింలోని నదులు తీస్తా, రంగిత్ లు సహజ సౌందర్యానికి  మరింత ఆకర్షణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వివిధ వర్గాల సంస్కృతులను ప్రతిబింబించే గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా సిక్కిం కలిగి ఉంది” చెప్పారు

“80 శాతం కంటే ఎక్కువ అక్షరాస్యత ఉన్న సిక్కిం, విద్య పరంగా అగ్రగామి రాష్ట్రాలలో ఒకటి. ఉన్నత విద్యతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని..  ముఖ్యంగా సిక్కింలో అబ్బాయిల కంటే బాలికల విద్యాశాతం నమోదు ఎక్కువగా ఉందని.. ఇది సిక్కిం ప్రజల విద్య పట్ల ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోందని ఆమె అన్నారు.

రాష్ట్రపతి బుధవారం నాగాలాండ్‌కు వచ్చారు. గురువారం కొహిమా జిల్లాలోని అంగామి నాగా కమ్యూనిటీకి చెందిన కిగ్వేమా అనే గ్రామాన్ని సందర్శించారు, అక్కడ ఆమె మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) సభ్యులతో సమావేశమయ్యారు. సిక్కిం చేరుకోవడానికి ముందు, ఆమె మిజోరాంలో పర్యటించారు. ఐజ్వాల్‌లోని మిజోరాం శాసనసభలో ప్రసంగించారు. దీంతో  APJ అబ్దుల్ కలాం (2005) , రామ్ నాథ్ కోవింద్ (2017) తర్వాత ఇలా శాసన సభలో ప్రసంగించిన మూడవ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఖ్యాతిగాంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..