Viral Video: ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ కుప్పకూలిన యువకుడు.. గుండెపోటుతో అక్కడిక్కడే మృతి

|

Sep 17, 2023 | 10:04 AM

యువకుడు ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత జిమ్ లో ఉన్న వ్యక్తులు యువకుడి దగ్గరకు చేరుకున్నారు. జిమ్‌లో జరిగిన ఘటన అంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఆ యువకుడు మెల్లగా ట్రెడ్‌మిల్‌పై పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. యువకుడు పడిపోయిన తరువాత జిమ్ సిబ్బంది అతని సమీపంలోకి పరిగెత్తారు. అయితే అప్పటికే ఆ యువకుడు మరణించాడు.

Viral Video: ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ కుప్పకూలిన యువకుడు.. గుండెపోటుతో అక్కడిక్కడే మృతి
Video Viral
Follow us on

గత కొంతకాలంగా వ్యాయామం చేస్తూనో, ఆడుతూనో హఠాత్తుగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి దుర్ఘటనలు రోజు రోజుకీ అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లోని ఓ జిమ్‌లో ఓ యువకుడు ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత జిమ్ లో ఉన్న వ్యక్తులు యువకుడి దగ్గరకు చేరుకున్నారు. జిమ్‌లో జరిగిన ఘటన అంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఆ యువకుడు మెల్లగా ట్రెడ్‌మిల్‌పై పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. యువకుడు పడిపోయిన తరువాత జిమ్ సిబ్బంది అతని సమీపంలోకి పరిగెత్తారు. అయితే అప్పటికే ఆ యువకుడు మరణించాడు.

ఈ ఘటన శనివారం రాత్రి 11.55 గంటలకు జరిగింది. పరుగు పరుగున ఓ యువకుడు మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, యువకుడు ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా, అకస్మాత్తుగా అతను దొర్లుతూ కిందకు పడిపోవడం కనిపించింది.

ఇవి కూడా చదవండి

అసలు విషయం ఏమిటంటే..

ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖోడాలోని సరస్వతి విహార్‌లో ఉన్న జిమ్‌లో యువకుడు వ్యాయామం చేస్తున్నాడు. ఆ యువకుడి పేరు సిద్ధార్థ్ అని తెలుస్తోంది. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ సిద్ధార్థ్‌ కిందపడడంతో అక్కడున్న వారు అతను అలిసిపోయి ఉంటాడని లేదా. ఏమైనా తల తిరిగి ఉంటుందని అందరూ భావించారు. త్వరగా అతని వద్దకు వెళ్లి.. అతడిని పైకి లేపేందుకు ప్రయత్నించగా .. అప్పటికే సిద్ధార్థ్ మృతి చెందాడు. మృతుడు బీహార్ వాసి అని చెబుతున్నారు. అతని మృతదేహాన్ని బీహార్‌లోని సొంత ఇంటికి తరలించారు.

అంతకుముందు కూడా జిమ్ లో మరణాలు

ప్రముఖ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సహా..  హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ కూడా ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నప్పుడు గుండెపోటుకు గురై అక్కడిక్కడే మరణించారు. వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కిందపడిపోయి మృత్యువాత పడ్డారు. అదేవిధంగా ప్రముఖ టీవీ స్టార్ సిద్ధార్థ్ శుక్లా కూడా ముంబైలోని ఓ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. తర్వాత అతను కూడా చనిపోయాడు.

వయసు, శారీరక సామర్థ్యానికి అనుగుణంగా జిమ్‌లో వర్కవుట్ చేయాలని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. చాలా సార్లు యువకులు ఎక్కువ సమయం జిమ్‌లో కష్టపడి వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం  గుండె ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..