Viral Video: భారత్‌లో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ అతనే.. మనవడికి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి.. ఎవరంటే

అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కు చెందిన టెస్లా, భారత్​లో తన మొదటికారును శుక్రవారం డెలివరీ చేసింది. పూర్తి తెలుపు రంగులో ఉన్న ఈ 'వై'(Y) మోడల్​ ఎలక్ట్రిక్‌ కారు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్​ సర్​నాయక్​ కొనుగోలు చేశారు. ఆయన ఈ కారును తన మనవడికి కానుకగా...

Viral Video:  భారత్‌లో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ అతనే.. మనవడికి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి.. ఎవరంటే
First Tesla Car Delivered I

Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 05, 2025 | 9:10 PM

అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కు చెందిన టెస్లా, భారత్​లో తన మొదటికారును శుక్రవారం డెలివరీ చేసింది. పూర్తి తెలుపు రంగులో ఉన్న ఈ ‘వై'(Y) మోడల్​ ఎలక్ట్రిక్‌ కారు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్​ సర్​నాయక్​ కొనుగోలు చేశారు. ఆయన ఈ కారును తన మనవడికి కానుకగా ఇవ్వనున్నట్లు తెలిపారు. టెస్లా జులై 15న ముంబయిలోని బీకేసీలో తన మొదటి షోరూంను ప్రారంభించింది. ఇప్పటి వరకు 600 బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే మొదటి కారును మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ కొనుగోలు చేశారు. దీనితో సెప్టెంబర్​ 5న ముంబయిలోని టెస్లా ఎక్స్​పీరియెన్స్ సెంటర్ ప్రతినిధులు మంత్రి ప్రతాప్​నకు ఆ కారును డెలివరీ చేసి, తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో తొలి టెస్లా కారును కొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. తను ఈ కారు కొనుగోలు కోసం ఎలాంటి డిస్కౌంట్ తీసుకోలేదనీ పూర్తి మొత్తం చెల్లించినట్లు చెప్పారు. దీనిని తన మనవడికి కానుకగా ఇస్తున్నాననీ ఇందులో కూర్చొని స్కూల్‌కు వెళ్లి, అందరికీ పర్యావరణ అనుకూల వాహనాల గురించి సందేశాన్ని ఇస్తాననీ ఎందుకంటే, పర్యావరణ హితమైన వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనీ అన్నారు.

విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తను ఈ వాహనాన్ని కొనుగోలు చేశాననీ రానున్న 10 ఏళ్లలో మరిన్ని ఈవీలు రోడ్లపైకి రావాలని మంత్రి ప్రతాప్‌ చెప్పారు. తమ ప్రభుత్వం కూడా వీలైనంత వరకు పర్యావరణ అనుకూల కార్లను ప్రోత్సహించడానికి కృషి చేస్తోందనీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని టోల్​ బూత్​ల వద్ద ఈవీ వాహనాలకు డిస్కౌంట్లు ఇస్తోందనీ అన్నారు. అలాగే ఆటోమొబైల్​ కంపెనీలు కూడా వినియోగదారులకు ప్రతి చోట ఛార్జింగ్ సౌకర్యాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయనీ తెలిపారు.

వీడియో చూడండి: