Viral News: రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన వలసకూలీ.. భయంతో పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసిన వ్యక్తి

తనకు లాటరీ తగిలిన విషయం తెలిసి ఆనందంతో ఎగిరి గంతేసాడు. అంతలోనే భయంతో వణికిపోయాడు. ఎందుకంటే.. ఈ విషయం ఎవరికైనా తెలిసి, తనపై దాడిచేసి, తన లాటరీ టికెట్‌ లాగేసుకుంటారేమో అని భయపడ్డాడు.

Viral News: రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన వలసకూలీ.. భయంతో పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసిన వ్యక్తి
Kerala Lottery Result

Updated on: Mar 18, 2023 | 9:59 AM

పశ్చిమబెంగాల్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వలసకూలీకి లాటరీలో లక్షల రూపాయల ప్రైజ్‌మనీ వచ్చింది. అయితే ఆ విషయం తెలియగానే అతను భయంతో పోలీస్‌ స్టేషన్‌కు పరిగెత్తాడు. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకున్నాడు.. అసలు విషయంలోకి వెళ్తే..

పశ్చిమ బెంగపశ్చిమ బెంగాల్ కూలీకి కేరళకి వచ్చిన ఎస్‌.కె.బాదేశ్‌ అనే వ్యక్తి కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇతనికి లాటరీ టికెట్లు కొనడం హాబీ. దాంతో కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్త్రీశక్తి లాటరీ టికెట్ కొన్నాడు. అతని అదృష్టం ఫలించి 75 లక్షలు లాటరీ తగిలింది. కూలీ కాస్తా రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. తనకు లాటరీ తగిలిన విషయం తెలిసి ఆనందంతో ఎగిరి గంతేసాడు. అంతలోనే భయంతో వణికిపోయాడు. ఎందుకంటే.. ఈ విషయం ఎవరికైనా తెలిసి, తనపై దాడిచేసి, తన లాటరీ టికెట్‌ లాగేసుకుంటారేమో అని భయపడ్డాడు.

వెంటనే పోలీస్‌ స్టేషన్‌కి పరుగెత్తాడు. పోలీసులకు విషయం చెప్పి తనకు రక్షణ కల్పించాలంటూ మొరపెట్టుకున్నాడు. అతని నిస్సహాయతను చూసిన పోలీసులు అతనికి అండగా ఉంటామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాదేశ్‌ లాటరీ తగిలిన డబ్బుతో సొంతూరులో ఉన్న తన ఇంటిని బాగుచేయించుకుంటానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..