Viral: నదీ తీరానికి వెళ్లిన వ్యక్తికి మెరుస్తూ కనిపించిన వస్తువు.. దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అద్భుతం
స్నానం చేసేందుకు ఓ వ్యక్తి నదీ తీరానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను బిందెను కడుగుతుండగా దూరం నుంచి ఓ వస్తువు మెరుస్తూ కనిపించింది. దీంతో వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు.

Trending: శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో శివుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భక్తులు శ్రావణ మాసంలో శివుడిని భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. నిశ్చలమైన మనస్సుతో కొలిస్తే.. శివుడు ప్రసన్నుడై అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర మాసంలో భక్తులు శివలింగానికి నీరు, పాలు, భాంగ్, బిల్వపత్వం మొదలైన వాటిని సమర్పిస్తారు. అయితే శ్రావణ మాసం ప్రారంభానికి ముందే యూపీలోని మౌ జిల్లాలో సరయూ నది వంతెన కింద ఇసుకలో భారీ వెండి శివలింగం కనిపించింది . ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఘఘ్రా నదీ తీరానికి వెళ్లిన ఓ వ్యక్తికి దూరం నుంచి ఓ వస్తువుమెరుస్తూ కనిపించింది.దీంతో ఆతృత దగ్గరికి వెళ్లి పరిశీలించగా..అది వెండి శివలింగం అని నిర్ధారణ అయ్యింది. శివలింగం దొరికిందని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని విచారించి శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు శివయ్య దర్శనం కోసం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పూజలు చేశారు. శివలింగం ఎత్తు ఒకటిన్నర అడుగులు ఉండగా.. బరువు 25 నుండి 30 కిలోలు ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘హర హర మహాదే’ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టగా.. ‘భగవంతుడు భూమిపైకి తిరిగి వస్తున్నాడు, కలియుగం ముగింపు దగ్గర పడినట్లు కనిపిస్తోంది’ అని మరో యూజర్ పేర్కొన్నారు.

UP | Some people saw a glowing object in the Ghaghra river. On taking out the object, it was found that it is a Shivling, it has been kept in the Malkhana of the police station respectfully. It will be investigated by special agencies: Avinash Pandey, SP Mau (16.07) pic.twitter.com/vd734g7QSc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 16, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
