PM Modi: భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. పీఎం మోదీపై ప్రశంసలు..

|

Aug 01, 2024 | 3:34 PM

ప్రపంచంలోనే అగ్రదేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని.. అది కూడా ప్రధాని మోదీ నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్హ్. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ విచ్చేసిన ఆయన ప్రధానమంత్రిపై ప్రశంసలు కురిపించారు.

PM Modi: భారత్లో వియత్నాం ప్రధాని పర్యటన.. పీఎం మోదీపై ప్రశంసలు..
Pm Modi Vietnam Pm
Follow us on

ప్రపంచంలోనే అగ్రదేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని.. అది కూడా ప్రధాని మోదీ నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్హ్. మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ విచ్చేసిన ఆయన ప్రధానమంత్రిపై ప్రశంసలు కురిపించారు. గత 10 సంవత్సరాల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు. ప్రపంచ స్థాయిలో అగ్రశక్తిగా భారతదేశం తనదైన ముద్ర వేయడంలో మోదీ మార్క్ ఉందన్నారు. 18వ లోక్‌సభ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు గానూ ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏలకు ఆయన అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ, ఎన్డీఏ పార్టీ.. భారత ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్హ్.

 

ఇదిలా ఉంటే.. భారతదేశం వియత్నాంను తన యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలక స్తంభంగా.. ఇండో-పసిఫిక్ దృష్టిలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే భారత్, వియత్నాం దేశాలు తమ వ్యూహాత్మక సంబంధాలను విస్తరించేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. అలాగే రెండు దేశాలూ స్వేచ్చా, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ కోసం పని చేస్తాయని.. మేము విస్తార్‌వాద్‌కు కాదు, ‘వికాస్‌వాద్‌కి’ మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల ప్రధానులు విస్తృతస్థాయి చర్చల అనంతరం.. 300 మిలియన్ డాలర్ల డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డీల్ అగ్నేయ ఆసియా దేశం సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు.