రూల్స్ బ్రేక్.. కొచ్చి లోని బహుళ అంతస్తులు క్షణాల్లో నేలమట్టం

కేరళలోని కొచ్చిలో శనివారం బహుళ అంతస్థుల నిర్మాణాలు క్షణాల్లో కుప్పకూలాయి. కేవలం కొన్ని సెకండ్లలో ఇవి నేలమట్టమయ్యాయి. ఈ కోస్టల్ సిటీలో లెక్కకు మిక్కిలి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ‘ మరాదూ ‘ పోష్ లొకాలిటీలో గల ఈ భవనాలన్నీ కోస్తా తీరప్రాంత నిబంధనలను అతిక్రమించి కట్టినవేనట. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేరళ ప్రభుత్వం వీటి నేలమట్టానికి ఆదేశాలిచ్చింది. రెండురోజులపాటు కూల్చివేతలు సాగుతాయి.వీటి కూల్చివేతకు కేరళ ప్రభుత్వం 138 రోజుల గడువునిచ్చింది. తమ ఫ్లాట్లను కోల్పోయినవారికి రూ. 25 […]

రూల్స్ బ్రేక్.. కొచ్చి లోని బహుళ అంతస్తులు క్షణాల్లో నేలమట్టం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 11, 2020 | 12:34 PM

కేరళలోని కొచ్చిలో శనివారం బహుళ అంతస్థుల నిర్మాణాలు క్షణాల్లో కుప్పకూలాయి. కేవలం కొన్ని సెకండ్లలో ఇవి నేలమట్టమయ్యాయి. ఈ కోస్టల్ సిటీలో లెక్కకు మిక్కిలి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ‘ మరాదూ ‘ పోష్ లొకాలిటీలో గల ఈ భవనాలన్నీ కోస్తా తీరప్రాంత నిబంధనలను అతిక్రమించి కట్టినవేనట. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేరళ ప్రభుత్వం వీటి నేలమట్టానికి ఆదేశాలిచ్చింది. రెండురోజులపాటు కూల్చివేతలు సాగుతాయి.వీటి కూల్చివేతకు కేరళ ప్రభుత్వం 138 రోజుల గడువునిచ్చింది. తమ ఫ్లాట్లను కోల్పోయినవారికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 350 ఫ్లాట్లతో కూడిన ఈ భవనాలను నేలమట్టం చేయడానికి 800 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడంలేదు. అలాగే అన్ని రకాల ట్రాఫిక్ రాకపోకలను, జల, వైమానిక రవాణాను కూడా నిషేధించారు. తమ ఇళ్లను వదిలి వెళ్లేవారు విద్యుత్, స్విచ్ లను ఆఫ్ చేసి వెళ్లాలని ముందుగానే ఆదేశించారు. వీరికి తాత్కాలిక రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.  శనివారం 18 అంతస్థుల అపార్ట్ మెంట్ ను, 73 ఫ్లాట్లతో కూడిన భవనాన్ని కూల్చివేశారు. ఆదివారం కూడా మరో బహుళ అంతస్థుల భవనాన్ని కుప్పకూల్చనున్నారు.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం