AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మదర్సాలలో వందేమాతరం ఆలపించడం తప్పనిసరి.. సువేందు సర్కార్ సంచలన నిర్ణయం!

పశ్చిమ బెంగాల్‌లోని సువేందు అధికారి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ సహాయం పొందే, గుర్తింపు పొందిన అన్ని మదర్సాలలో తరగతులు ప్రారంభమయ్యే ముందు "వందేమాతరం" గీతాన్ని ఆలపించడాన్ని ఇప్పుడు తప్పనిసరి చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ప్రతి మదర్సాలో ప్రార్థన సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం ఇకపై తప్పనిసరి అవుతుంది.

మదర్సాలలో వందేమాతరం ఆలపించడం తప్పనిసరి.. సువేందు సర్కార్ సంచలన నిర్ణయం!
Vande Mataram Compulsory In Madrasas
Balaraju Goud
|

Updated on: May 21, 2026 | 10:33 AM

Share

పశ్చిమ బెంగాల్‌లోని సువేందు అధికారి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ సహాయం పొందే, గుర్తింపు పొందిన అన్ని మదర్సాలలో తరగతులు ప్రారంభమయ్యే ముందు “వందేమాతరం” గీతాన్ని ఆలపించడాన్ని ఇప్పుడు తప్పనిసరి చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ప్రతి మదర్సాలో ప్రార్థన సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం ఇకపై తప్పనిసరి అవుతుంది.

పశ్చిమ బెంగాల్ విద్యా వ్యవస్థలో ఒక సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఆర్థిక సహాయం పొందే అన్ని మదర్సాలలో కూడా తరగతులు ప్రారంభమయ్యే ముందు వందేమాతరం గీతాన్ని ఆలపించడాన్ని సువేందు అధికారి ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ మంత్రి ఖుదీరామ్ టుడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. విద్యా సంస్థల్లో జాతీయ భావనను పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.

కేవలం సాధారణ పాఠశాలలే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గుర్తింపు పొందిన మదర్సాలలో కూడా అసెంబ్లీ సమయంలో వందేమాతరం పాడటం ఇకపై విధిగా మారుతుంది. మంత్రి ఖుదీరామ్ టుడు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, “ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో, సంతాలి భాషా పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరి అయినప్పుడు, మదర్సాలలో దానిని అమలు చేయడంలో అభ్యంతరం ఎందుకు ఉండాలి?” అని ప్రశ్నించారు. విద్యార్థులలో చిన్నతనం నుండే క్రమశిక్షణతో పాటు దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి ఈ ఉత్తర్వులు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం రాష్ట్ర విద్యా రంగంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని మద్దతుదారులు భావిస్తుండగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, విద్యా సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉత్తర్వులను ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us