వందే భారత్ స్లీపర్ ట్రయల్స్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వందే భారత్ స్లీపర్ రైలు సెట్ ICF చెన్నై నుండి RDSO ద్వారా ఫీల్డ్ ట్రయల్స్ కోసం బయలుదేరిందని సమాచారం. ICF సహకారంతో BEML ఆధ్వర్యంలో తయారు చేసిన ఈ రైలును భారతీయ రైల్వే రైలు వారు గత 2 నెలలుగా ICFలో నాణ్యత ప్రామాణిక తనిఖీలను నిర్వహిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ అంటే పేరులో అర్థమవుతుంది ఇది స్లీపర్ వేరియంట్ అని.. ప్రీమియం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ అత్యుత్తమ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. 160 kmph గరిష్ట వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఈ రైలు ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాన్ని ఎఫిసియెంట్‌గా మార్చాడానికి ఈ వందే భారత్ స్లీపర్‌ను తీసుకొచ్చారు.
వందే భారత్ స్లీపర్ రైలు నమూనాను భారతీయ రైల్వేలోని ఖజురహో నుండి మహబో సెక్షన్‌లో RDSO విస్తృతంగా పరీక్షించనుంది. సెక్యూరిటీ క్లియరెన్స్ పొందిన తర్వాత మాత్రమే ఇది సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి వస్తుంది. వందేభారత్ స్లీపర్ రైళ్లను సుదూర, మధ్య దూర ప్రయాణాలకు రూపకల్పన చేశామని, వాటిలో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. డిసెంబర్ 2 వరకు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ‘చైర్-కార్’ కోచ్‌లతో 136 వందే భారత్ రైలు సేవలు నడుస్తున్నాయని చెప్పారు. వీటిలో 16 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తమిళనాడులోని స్టేషన్ల అవసరాలను తీరుస్తున్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీ-వారణాసి మధ్య 771 కిలోమీటర్ల దూరంతో వందేభారత్ రైలు నడుస్తోందని మంత్రి తెలిపారు.
వందే భారత్ స్లీపర్: టాప్ ఫీచర్లు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి