Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!

|

Dec 05, 2021 | 3:09 PM

బాబులూ కరోనా కొత్తగా విరుచుకుపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. టీకా వెంటనే వేయించుకోండి. ఇలా ప్రభుత్వాలు ఎంత చెప్పినా కొంతమంది మాత్రం మాట వినడం లేదు. అశ్రద్ధ.. తెలియని తనం.. మాకేమవుతుందిలే అనే ధీమా.. వ్యాక్సిన్ తీసుకుంటే అనారోగ్యం వస్తుందేమో అనే భయం..

Vaccination Offer: టీకా వేయించుకోండి.. 50 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి..అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!
Corona Vaccination
Follow us on

Vaccination Offer: బాబులూ కరోనా కొత్తగా విరుచుకుపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. టీకా వెంటనే వేయించుకోండి. ఇలా ప్రభుత్వాలు ఎంత చెప్పినా కొంతమంది మాత్రం మాట వినడం లేదు. అశ్రద్ధ.. తెలియని తనం.. మాకేమవుతుందిలే అనే ధీమా.. వ్యాక్సిన్ తీసుకుంటే అనారోగ్యం వస్తుందేమో అనే భయం.. ఇలా రకరకాల కారణాలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇటువంటి వారికి టీకాలు వేయడం కోసం గుజరాత్ లోని రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ మెగా-వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 4 నుంచి ప్రారంభం అయిన ఈ మెగా టీకాల కార్యక్రమం 10వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో టీకా డోస్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆర్కేఎంసీ. టీకా తీసుకున్న వారికి లక్కీ డ్రా తీసి విజేతలకు 50 వేల రూపాయల విలువైన స్మార్ట్‌ఫోన్ బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని రాజ్‌కోట్ మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. ఇది మాత్రమె కాదండోయ్ టీకాలు వేసిన వారికీ ప్రత్యెక బహుమతి ఇవ్వబోతున్నారట. ఈ ప్రత్యేక టీకా డ్రైవ్‌లో ఎక్కువ మందికి టీకాలు వేసిన ఆరోగ్య కేంద్రానికి పురపాలక సంఘం 21,000 రూపాయల బహుమతిని ప్రకటించింది .

రాజ్‌కోట్‌లో దాదాపు 1.82 లక్షల మంది ఇంకా రెండవ డోస్ కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకోలేదని పౌర సంఘం తెలిపింది. ప్రత్యేక ప్రచారం సందర్భంగా నగరంలోని మొత్తం 22 ఆరోగ్య కేంద్రాల్లో 12 గంటల పాటు (ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు) పనిచేసి అత్యధిక మందికి వ్యాక్సిన్‌ వేయనున్నారు.

అంతకుముందు గుజరాత్‌లోని మరో నగరం కూడా ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించింది. అహ్మదాబాద్ పౌర సంఘం కూడా లక్కీ డ్రా పోటీని ప్రకటించింది. దీనిలో విజేత 60,000 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్‌ను పొందుతారు. డిసెంబర్ 1-7 తేదీల మధ్య COVID-19 వ్యాక్సిన్‌ని రెండవసారి తీసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. ఒక విజేత తర్వాత లక్కీ డ్రా ద్వారా ప్రకటించబడతారు.

ఇదిలా ఉండగా, శనివారం గుజరాత్‌లో ఓమిక్రాన్ వేరియంట్‌లో మొదటి కేసు నమోదైంది. జింబాబ్వే నుండి రాష్ట్రానికి వచ్చిన కొద్ది రోజుల తర్వాత, గుజరాత్‌లోని జామ్‌నగర్ నగరంలో 72 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కొత్త వేరియంట్‌తో బారిన పడినట్టు తేలింది.

జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తి గత కొన్నేళ్లుగా జింబాబ్వేలో నివసిస్తున్నాడు. తన మామగారిని కలిసేందుకు గుజరాత్ వచ్చాడు. అతనికి గొంతు నొప్పి, జ్వరం వచ్చిన తరువాత, అతని డాక్టర్ అతనికి ఆర్టీపీసీఆర్(RT-PCR) పరీక్ష చేయించుకోవాలని సూచించారని జామ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపారు. ఆ వ్యక్తి కరోనా పాజిటివ్ గా తేలిందని గురువారం ఒక ప్రైవేట్ లేబొరేటరీ పౌర అధికారులకు సమాచారం అందించింది. తదనంతరం, అతన్ని గురుగోవింద్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

ఇవి కూడా చదవండి: Health Tips: ‘టీ’తో కలిపి ఈ ఆహారపదార్ధాలను తీసుకుంటున్నారా.. అలాగైతే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!

Instagram: మీకు నచ్చని వారు చేసే కామెంట్లు, అందరికీ కనిపించకుండా చేయొచ్చు.. ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌..

Pragya Jaiswal: అందాలతో కవ్విస్తున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్