Uttarkashi Trekkers: ఉత్తరకాశీలో విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి.. నలుగురు గల్లంతు!

|

Jun 05, 2024 | 8:45 PM

హిమాలయాల్లో ట్రెక్కింగ్ విషాదం నింపింది. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి చెందగా.. నలుగురు గల్లంతు అయ్యారు. ఉత్తరకాశీలో విషాదం చోటుచేసుకుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మంచు తుఫాన్‌లో చిక్కుకున్న 22 మంది ట్రెక్కర్లులో హెలికాప్టర్ సహాయంతో 13 మందిని కాపాడారు సిబ్బంది.

Uttarkashi Trekkers: ఉత్తరకాశీలో విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి.. నలుగురు గల్లంతు!
Trackers Rescued
Follow us on

హిమాలయాల్లో ట్రెక్కింగ్ విషాదం నింపింది. ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి చెందగా.. నలుగురు గల్లంతు అయ్యారు. ఉత్తరకాశీలో విషాదం చోటుచేసుకుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మంచు తుఫాన్‌లో చిక్కుకున్న 22 మంది ట్రెక్కర్లులో హెలికాప్టర్ సహాయంతో 13 మందిని కాపాడారు సిబ్బంది. ట్రెక్కర్లు కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. సహస్రతల్ ప్రాంతంలో ఘటన జరిగింది.

కర్ణాటక ట్రెక్కింగ్ అసోసియేషన్‌కు చెందిన 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీలోని సిల్లా గ్రామం నుండి సహస్త్రాల్‌కు బయలుదేరింది. భట్వాడి మల్లా-సిల్లా-కుష్కల్యాణ్-సహస్త్రాటల్ ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఐదుగురు ట్రెక్కర్లు మరణించారు. 13 మంది ట్రెక్కర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అటవీ శాఖకు చెందిన పది మంది సభ్యులతో కూడిన రెక్సీ అండ్ రెస్క్యూ టీమ్ సిల్లా గ్రామానికి చెందిన 8 మందిని రక్షించి డెహ్రాడూన్‌లోని హెలిప్యాడ్‌కు తీసుకువచ్చింది.రెండు ట్రెక్కర్లను రక్షించి ఉత్తరకాశీలోని నతీన్ హెలీ ప్యాడ్‌కు తీసుకువస్తున్నారు.

ట్రెక్కింగ్ టీమ్‌లో 18మంది కర్నాటక, ఒకరు మహారాష్ట్ర, ముగ్గురు ఉత్తరకాశీకి చెందిన టూరిస్ట్ గైడ్‌లు గుర్తించారు అధికారులు. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ మనేరి ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కి.మీ. దూరంలో ఉన్న ట్రెక్కింగ్‌ పాయింట్‌కు చేరుకున్నట్లు ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ అధికారులు తెలిపారు. హిమాలయాల్లో 4 వేల100 నుండి 4 వేల400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైన్ సరస్సు వద్ద ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయి ఐదుగురు మరణించినట్లు చెప్పారు.

అయితే వారిలో ఫస్ట్‌ 18 మంది జాడ తెలియకపోవడంతో హెలికాప్టర్ సాయంతో గాలించారు. 13మందిని గుర్తించగా.. మరో నలుగురు గల్లంతైనట్లు ట్రెక్కింగ్ ఏజెన్సీ నిర్థారించింది. అయితే జూన్ 7 నాటికి బృందం తిరిగి రావాల్సి ఉండగా, కానీ చివరి బేస్ క్యాంప్ నుంచి సహస్రతల్‌కు చేరుకునేసరికి వాతావరణం సరిగా లేకపోవడంతో వారు దారి తప్పారని చెప్పారు జిల్లా కలెక్టర్. గల్లంతైన వారి కోసం ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నారు. క్షతగాత్రులను వెంటనే హెలికాప్టర్‌ ద్వారా తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచు, వ‌ర్షం ఎక్కువ‌గా కురుస్తున్న కార‌ణంగా.. విజిబులిటీ క్షీణించింద‌ని, అందుకే హెలికాప్టర్లతో జ‌రుగుతున్న రెస్క్యూ ఆప‌రేష‌న్ నిదానంగా సాగుతున్నట్లు తెలిపారు.

సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించే వివిధ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయాన్ని నిర్వహించే బాధ్యతను పోలీస్ సూపరింటెండెంట్ అర్పన్ యదువంశీకి అప్పగించారు. ఒంటరిగా ఉన్న ట్రెక్కర్‌లను వెతకడం, రక్షించడం కోసం అధికారులు వైమానిక దళాన్ని అభ్యర్థించింది. దీని దృష్ట్యా, మాతలి, హర్సిల్‌తో సహా ఇతర హెలిప్యాడ్‌ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశారు. అందిన సమాచారం ప్రకారం వైమానిక దళానికి చెందిన హెలీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌లో పాల్గొంటోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..